Appadinumti numdaana naumgaadanavu neevu

అప్పటినుంటి నుందాన నౌఁగాదనవు నీవు
Language

(॥పల్లవి॥)
అప్పటినుంటి నుందాన నౌఁగాదనవు నీవు
చెప్పేవారిమాట లెల్ల చేకొంటిఁగదరా

(॥అప్ప॥)
యెన్నకె నెదుటనుంటే యేమీ ననరు గాని
కన్నురెప్ప లడ్డమైతే కాఁతాళింతురు
నిన్నే యనఁగరాదు నీతలనే వేగదు
సన్నలదంపతులకు సాజ మిదే కదరా

(॥అప్ప॥)
తగులఁ బోతే వలపు తమిఁ జప్పనవుఁ గాని
మొగము లడ్డపెట్టితే మెుక్క వత్తురు
జిగిఁ దలవించితివి చింతించకు నీ వంత
జగములోపలి వారిసాజ మిదే కదరా

(॥అప్ప॥)
వెంట వెంటఁ దిరిగితే వేసాలఁ బోదురు గాని
యింటికాడ నుండితేను యేదీ యందురు
గొంటవై శ్రీవేంకటేశ కూడితివి నన్ను నిట్టె
జంట నలమేల్మంగను సాజ మిదే కదరా

(||pallavi||)
appaḍinuṁṭi nuṁdāna naum̐gādanavu nīvu
sĕppevārimāḍa lĕlla segŏṁṭim̐gadarā

(||appa||)
yĕnnagĕ nĕduḍanuṁṭe yemī nanaru gāni
kannurĕppa laḍḍamaide kām̐tāḽiṁturu
ninne yanam̐garādu nīdalane vegadu
sannaladaṁpadulagu sāja mide kadarā

(||appa||)
tagulam̐ bode valabu tamim̐ jappanavum̐ gāni
mŏgamu laḍḍabĕṭṭide mĕుkka vatturu
jigim̐ dalaviṁchidivi siṁtiṁchagu nī vaṁta
jagamulobali vārisāja mide kadarā

(||appa||)
vĕṁṭa vĕṁṭam̐ dirigide vesālam̐ boduru gāni
yiṁṭigāḍa nuṁḍidenu yedī yaṁduru
gŏṁṭavai śhrīveṁkaḍeśha kūḍidivi nannu niṭṭĕ
jaṁṭa nalamelmaṁganu sāja mide kadarā