అప్పటినుండియుఁ జూడ రమ్మలాల
(॥పల్లవి॥)
అప్పటినుండియుఁ జూడ రమ్మలాల
నొప్పగింత మిఁక పతి కువిద విరహము
(॥అప్ప॥)
సొంతే తామెరలైతే పొద్దుగూఁకినమీఁద
అంతఁ దెల్లవారుదాఁకా నరమోడ్చును
ఇంతికనుఁదామెరలయితే రేయిపగలు
యెఁతైన మొగియుట యెఱఁగ మెప్పుడును
(॥అప్ప॥)
జక్కవలు వొకవేళ సరున గూఁటిలోన
వొక్కరీతి గుట్టున దాంగుండుంగాని
చక్కనిచెలిచనుజక్కవలైతే నందు
తక్కకపయ్యదగూఁట దాఁగుటే కానము
(॥అప్ప॥)
చిగురుఁదీగెలు భూమిఁ జలపచెలపనీట
తగిలి నానాఁటికిఁ దనియుఁగాని
మగువ శ్రీవేంకటేశుమలయుమేఁదీగెలైతే
తగినరతిఁ జెమటఁ దనియుట గానము
(||pallavi||)
appaḍinuṁḍiyum̐ jūḍa rammalāla
nŏppagiṁta mim̐ka padi kuvida virahamu
(||appa||)
sŏṁte tāmĕralaide pŏddugūm̐kinamīm̐da
aṁtam̐ dĕllavārudām̐kā naramoḍchunu
iṁtiganum̐dāmĕralayide reyibagalu
yĕm̐taina mŏgiyuḍa yĕṟam̐ga mĕppuḍunu
(||appa||)
jakkavalu vŏgaveḽa saruna gūm̐ṭilona
vŏkkarīdi guṭṭuna dāṁguṁḍuṁgāni
sakkanisĕlisanujakkavalaide naṁdu
takkagabayyadagūm̐ṭa dām̐guḍe kānamu
(||appa||)
sigurum̐dīgĕlu bhūmim̐ jalabasĕlabanīḍa
tagili nānām̐ṭigim̐ daniyum̐gāni
maguva śhrīveṁkaḍeśhumalayumem̐dīgĕlaide
taginaradim̐ jĕmaḍam̐ daniyuḍa gānamu