Appadinumdiyu vibhumdatte tappaga soosee

అప్పటినుండియు విభుఁడట్టె తప్పక చూచీ
Language

(॥పల్లవి॥)
అప్పటినుండియు విభుఁడట్టె తప్పక చూచీ
యిప్పుడిట్టె రాఁగదవె యియ్యకొన్నదానవు

(॥అప్పటి॥)
చిత్తము పతికినిచ్చి సిగ్గులువడఁగనేలె
పొత్తుకు రమ్మనీ వలపుల నాతఁడు
కొత్తగాఁ బొందుసేసేవా కొంగువట్టి తీసితేను
వుత్తరువేమి చెప్పవే వూరకున్నదానవు

(॥అప్పటి॥)
యింటిలోననే వుండి యింకా మరఁగులేలే
అంటి పానుపుపైకి రమ్మనీ నాతఁడు
జంటలు నేఁడాయనా సత్తువలఁ బెనఁగితే
వొంటి నట్టే వుండఁగదే వొడఁబడ్డదానవు

(॥అప్పటి॥)
కలసి కాఁగిటఁ గూడి కన్నుల జంకెనలేలే
యెలయించీ శ్రీ వేంకటేశుఁడాతఁడు
చలములు యిఁకఁగద్దా చన్నులుగోరనొత్తితే
కొలఁదెరిఁగి నవ్వవే గుట్టుగలదానవు

(||pallavi||)
appaḍinuṁḍiyu vibhum̐ḍaṭṭĕ tappaga sūsī
yippuḍiṭṭĕ rām̐gadavĕ yiyyagŏnnadānavu

(||appaḍi||)
sittamu padiginichchi sigguluvaḍam̐ganelĕ
pŏttugu rammanī valabula nādam̐ḍu
kŏttagām̐ bŏṁdusesevā kŏṁguvaṭṭi tīsidenu
vuttaruvemi sĕppave vūragunnadānavu

(||appaḍi||)
yiṁṭilonane vuṁḍi yiṁkā maram̐gulele
aṁṭi pānububaigi rammanī nādam̐ḍu
jaṁṭalu nem̐ḍāyanā sattuvalam̐ bĕnam̐gide
vŏṁṭi naṭṭe vuṁḍam̐gade vŏḍam̐baḍḍadānavu

(||appaḍi||)
kalasi kām̐giḍam̐ gūḍi kannula jaṁkĕnalele
yĕlayiṁchī śhrī veṁkaḍeśhum̐ḍādam̐ḍu
salamulu yim̐kam̐gaddā sannulugoranŏttide
kŏlam̐dĕrim̐gi navvave guṭṭugaladānavu