Appadinumdi soose maabene neeyedudanu

అప్పటినుండి చూచే మాపెనే నీయెదుటను
Language

(॥పల్లవి॥)
అప్పటినుండి చూచే మాపెనే నీయెదుటను
కుప్పళించె పెంజెమట కుచముల వెంటను

(॥అప్ప॥)
రెప్పలెత్తి నిన్నుఁ జూచు రేసు లేక సిగ్గుతోను
కప్పిన పయ్యదకొంగు కడు బిగించు
చెప్పునొకమాట నీతో చెలియమాటుకుఁ బోవు
ఇప్పటి యీసతి మోహమేమందుమిఁకను

(॥అప్ప॥)
సెలవులఁ గొంత నవ్వు చెక్కునఁ జెయి చేర్చు
అలివేణి నీమాటే ఆలకించును
తలఁపులో నిన్ను నించు దగ్గరి నీవొద్దఁ బొంచు
వలపు లీపెకునాఁప వశముగాదిప్పుడు

(॥అప్ప॥)
సన్న సేసు నీతోడ చనవులే పచరించు
కన్నె నీకాఁగిటికిఁ బొంకము చూచును
అన్నిటా శ్రీవేంకటేశ అంతలో నీవు గూడితి-
విన్నేసి యీపెరతులకెన్నిక లేదిదివో

(||pallavi||)
appaḍinuṁḍi sūse mābĕne nīyĕduḍanu
kuppaḽiṁchĕ pĕṁjĕmaḍa kusamula vĕṁṭanu

(||appa||)
rĕppalĕtti ninnum̐ jūsu resu lega siggudonu
kappina payyadagŏṁgu kaḍu bigiṁchu
sĕppunŏgamāḍa nīdo sĕliyamāḍugum̐ bovu
ippaḍi yīsadi mohamemaṁdumim̐kanu

(||appa||)
sĕlavulam̐ gŏṁta navvu sĕkkunam̐ jĕyi sersu
aliveṇi nīmāḍe ālagiṁchunu
talam̐pulo ninnu niṁchu daggari nīvŏddam̐ bŏṁchu
valabu lībĕgunām̐pa vaśhamugādippuḍu

(||appa||)
sanna sesu nīdoḍa sanavule pasariṁchu
kannĕ nīgām̐giḍigim̐ bŏṁkamu sūsunu
anniḍā śhrīveṁkaḍeśha aṁtalo nīvu gūḍidi-
vinnesi yībĕradulagĕnniga ledidivo