Appadinela pilise vaasala nela pattevu

అప్పటినేల పిలిచే వాసల నేల పట్టేవు
Language

(॥పల్లవి॥)
అప్పటినేల పిలిచే వాసల నేల పట్టేవు
వొప్పుగా నీ పనులకే వొడిగట్టుకున్నది

(॥అప॥)
పలుమరు విడేలిచ్చి పాదొలొత్తె వేగినంతా
చెలి యేమిసేయవలెఁ జెప్పవయ్యా
వలసినట్టల్లా వీణె వాయించెఁ గొంతవడి
తలఁపు నీకెందుపైనొ తతి నీకే తెలుసు

(॥అప॥)
చేముట్టి సరమాడి సేవసేసె నిందాఁకా
యేమనేవు యింకా నానతీవయ్యా
కామించినట్టల్లాఁ గతలు చెప్పె నీకు
యేమో నీకు నిద్ర రాదు యెఱఁగము నేము

(॥అప॥)
పక్క నీకుఁ దొడు వండె బడివాయ దెప్పుడును
నిక్కి నీకితవైనట్టు నేరుపవయ్యా
వెక్కసపలమేలుమంగవిభుఁడ శ్రీవేంకటేశ
నెక్కొని పెండ్లాడితివి నీవన్నీ నేరుతువు

(||pallavi||)
appaḍinela pilise vāsala nela paṭṭevu
vŏppugā nī panulage vŏḍigaṭṭugunnadi

(||aba||)
palumaru viḍelichchi pādŏlŏttĕ veginaṁtā
sĕli yemiseyavalĕm̐ jĕppavayyā
valasinaṭṭallā vīṇĕ vāyiṁchĕm̐ gŏṁtavaḍi
talam̐pu nīgĕṁdubainŏ tadi nīge tĕlusu

(||aba||)
semuṭṭi saramāḍi sevasesĕ niṁdām̐kā
yemanevu yiṁkā nānadīvayyā
kāmiṁchinaṭṭallām̐ gadalu sĕppĕ nīgu
yemo nīgu nidra rādu yĕṟam̐gamu nemu

(||aba||)
pakka nīgum̐ dŏḍu vaṁḍĕ baḍivāya dĕppuḍunu
nikki nīgidavainaṭṭu nerubavayyā
vĕkkasabalamelumaṁgavibhum̐ḍa śhrīveṁkaḍeśha
nĕkkŏni pĕṁḍlāḍidivi nīvannī neruduvu