అప్పటినేల దూరేరే అతని నోచెలులాల
(॥పల్లవి॥)
అప్పటినేల దూరేరే అతని నోచెలులాల
కుప్పళించె వలపెల్ల గురుతిదే కాదా
(॥అప్ప॥)
కన్నులనే నవ్వినాఁడు కడు బుజ్జగించినాఁడు
అన్నిటానెంచిచూచితే నాతఁడే నేను
మన్నన కడమ లేదు మనసు వెలితిలేదు
ఉన్నదాన రాజువలె నొరులు నాసరియా
(॥అప్ప॥)
చేయిసన్న చేసినాఁడు చెట్టవట్టి తీసినాఁడు
ఆయనాయఁ బనులెల్లనప్పుడే నాకు
పాయములునొక్కసరే భావములుఁ దారుకాణే
యీయెడ నాకోరికాయ నెదురేదే నాకు
(॥అప॥)
కళలెల్ల రేఁచినాఁడు కాఁగిటనే కూడినాఁడు
పలుకుఁ బంతము చెల్లెఁ బై పై నేఁడు
యెలమి శ్రీవేంకటేశుఁడింత నన్నెక్కుడు సేసె
బలువాయ నామాట పట్టరాదు మదము
(||pallavi||)
appaḍinela dūrere adani nosĕlulāla
kuppaḽiṁchĕ valabĕlla gurudide kādā
(||appa||)
kannulane navvinām̐ḍu kaḍu bujjagiṁchinām̐ḍu
anniḍānĕṁchisūside nādam̐ḍe nenu
mannana kaḍama ledu manasu vĕlidiledu
unnadāna rājuvalĕ nŏrulu nāsariyā
(||appa||)
seyisanna sesinām̐ḍu sĕṭṭavaṭṭi tīsinām̐ḍu
āyanāyam̐ banulĕllanappuḍe nāgu
pāyamulunŏkkasare bhāvamulum̐ dārugāṇe
yīyĕḍa nāgorigāya nĕdurede nāgu
(||aba||)
kaḽalĕlla rem̐sinām̐ḍu kām̐giḍane kūḍinām̐ḍu
palugum̐ baṁtamu sĕllĕm̐ bai pai nem̐ḍu
yĕlami śhrīveṁkaḍeśhum̐ḍiṁta nannĕkkuḍu sesĕ
baluvāya nāmāḍa paṭṭarādu madamu