Appadim gosaranela aasodamaa

అప్పటిఁ గొసరనేల ఆసోదమా
Language

(॥పల్లవి॥)
అప్పటిఁ గొసరనేల ఆసోదమా
తప్పక నన్నుఁ జూచిన తగనిదె చాలదా

(॥అప్ప॥)
అరిదివలె మాయింటి కటు నీవు వచ్చితేను
వరుసకు రానంటా వాదింతునా
గరిమ నీపాటివుపకారము చేసిననిను
సరుస మెచ్చుటగాక సాదించవచ్చునా

(॥అప్ప॥)
మచ్చిక నెట్టకేలకు మాటలు నీవాడితేను
ఇచ్చకములాడవంటా యీసడింతునా
విచ్చ నీచుట్టరికము నెరపినయట్టునిన్ను
రచ్చ నుతించుటగాక రాఁపుసేయవచ్చునా

(॥అప్ప॥)
చేయిచాఁచి ఇన్నాళ్లకు చెనకి కాఁగిలించితే
కాయము చొక్కించవంటా కాఁతాళింతువా
యీయెడ శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేండు
పాయకవుండుటగాక పంగించవచ్చునా

(||pallavi||)
appaḍim̐ gŏsaranela āsodamā
tappaga nannum̐ jūsina taganidĕ sāladā

(||appa||)
aridivalĕ māyiṁṭi kaḍu nīvu vachchidenu
varusagu rānaṁṭā vādiṁtunā
garima nībāḍivubagāramu sesinaninu
sarusa mĕchchuḍagāga sādiṁchavachchunā

(||appa||)
machchiga nĕṭṭagelagu māḍalu nīvāḍidenu
ichchagamulāḍavaṁṭā yīsaḍiṁtunā
vichcha nīsuṭṭarigamu nĕrabinayaṭṭuninnu
rachcha nudiṁchuḍagāga rām̐puseyavachchunā

(||appa||)
seyisām̐si innāḽlagu sĕnagi kām̐giliṁchide
kāyamu sŏkkiṁchavaṁṭā kām̐tāḽiṁtuvā
yīyĕḍa śhrīveṁkaḍeśha yelidivi nannu neṁḍu
pāyagavuṁḍuḍagāga paṁgiṁchavachchunā