Appadim daa mamchivaamda nanugonunu

అప్పటిఁ దా మంచివాఁడ ననుకొనును
Language

(॥పల్లవి॥)
అప్పటిఁ దా మంచివాఁడ ననుకొనును
చెప్పరే బుద్దులు మీరు చెలులాల పతికి

(॥అప్పటి॥)
మోము చూచితే నాకు మొగవమోట దరచూ
దోమటి నాతని నే దూరఁ బొయ్యేనా
గామిటిమాట లాడితే గబ్బి నందురు
యేమి సేతు నమ్మలాల యెం దున్నాఁడో అతఁడు

(॥అప్పటి॥)
గక్కనఁ గదిసితే కరఁగు నా చిత్తము
మక్కువ నాతని నేను మట్టు పెట్టేనా
చక్క నూర కుండితే రాజస మందురు
దక్కితి నే నమ్మలాల తా నేడ నున్నాఁడే

(॥అప్పటి॥)
సొలసి మా టాడితే చుట్టమ నే నౌదునూ
కలసే శ్రీవెంకటేశుఁ గా దనేనా
చలపట్టి మెచ్చఁ బోతే సట లందురు
వలచితి నమ్మలాల వాఁడె నవ్వీ నదివో

(||pallavi||)
appaḍim̐ dā maṁchivām̐ḍa nanugŏnunu
sĕppare buddulu mīru sĕlulāla padigi

(||appaḍi||)
momu sūside nāgu mŏgavamoḍa darasū
domaḍi nādani ne dūram̐ bŏyyenā
gāmiḍimāḍa lāḍide gabbi naṁduru
yemi sedu nammalāla yĕṁ dunnām̐ḍo adam̐ḍu

(||appaḍi||)
gakkanam̐ gadiside karam̐gu nā sittamu
makkuva nādani nenu maṭṭu pĕṭṭenā
sakka nūra kuṁḍide rājasa maṁduru
dakkidi ne nammalāla tā neḍa nunnām̐ḍe

(||appaḍi||)
sŏlasi mā ṭāḍide suṭṭama ne naudunū
kalase śhrīvĕṁkaḍeśhum̐ gā danenā
salabaṭṭi mĕchcham̐ bode saḍa laṁduru
valasidi nammalāla vām̐ḍĕ navvī nadivo