అప్పటి వావు లడిగీ నద్దిరా వీఁడు
(॥పల్లవి॥)
అప్పటి వావు లడిగీ నద్దిరా వీఁడు
చెప్పరాని చేఁతలెల్లాఁ జేసీనే వీఁడు
(॥అప్ప॥)
చల్లలమ్మేచోటనెల్ల జాణతనా లాడి వీఁడు
పిల్లఁగోవిరాగాల బెల్లించీ వీఁడు
గొల్లెతల నేడవై నాఁ గొంగులువట్టి వీఁడు
యిల్లిల్లు దప్పక వున్నాఁ డెవ్వడే వీఁడు
(॥అప్ప॥)
చేరి చుట్టరికాలెల్లాఁ జెప్పీ కాఁగిలించీ వీఁడు
నీరాడేచోటుల నెల్ల నిలిచీ వీఁడు
యేరులో జాగరాలు సేయించీ వేగినంతా వీఁడు
దూరులకు వెరవఁ డెం దుండి వచ్చె వీఁడు
(॥అప్ప॥)
చక్క వచ్చి నిద్రించఁగా సంగడిఁ బండీ వీఁడు
జక్కవలంటాఁ బట్టీ చన్నులు వీఁడు
వెక్కసపుగుణాల శ్రీవేంకటేశుఁడు వీఁడు
చొక్కపురతులఁ గూడీ చూడరేవీఁడు
(||pallavi||)
appaḍi vāvu laḍigī naddirā vīm̐ḍu
sĕpparāni sem̐talĕllām̐ jesīne vīm̐ḍu
(||appa||)
sallalammesoḍanĕlla jāṇadanā lāḍi vīm̐ḍu
pillam̐govirāgāla bĕlliṁchī vīm̐ḍu
gŏllĕdala neḍavai nām̐ gŏṁguluvaṭṭi vīm̐ḍu
yillillu dappaga vunnām̐ ḍĕvvaḍe vīm̐ḍu
(||appa||)
seri suṭṭarigālĕllām̐ jĕppī kām̐giliṁchī vīm̐ḍu
nīrāḍesoḍula nĕlla nilisī vīm̐ḍu
yerulo jāgarālu seyiṁchī veginaṁtā vīm̐ḍu
dūrulagu vĕravam̐ ḍĕṁ duṁḍi vachchĕ vīm̐ḍu
(||appa||)
sakka vachchi nidriṁcham̐gā saṁgaḍim̐ baṁḍī vīm̐ḍu
jakkavalaṁṭām̐ baṭṭī sannulu vīm̐ḍu
vĕkkasabuguṇāla śhrīveṁkaḍeśhum̐ḍu vīm̐ḍu
sŏkkaburadulam̐ gūḍī sūḍarevīm̐ḍu