(॥పల్లవి॥)
అప్పటి తారుకాణ లౌనో కావో
తప్పక యీ గురుతులు తలఁచుకో నీవు
(॥అప్ప॥)
ఇందాఁకా మాటలాడె యెరవులేక నీతో
యెందుండి వచ్చె నాపె యేమో నీకు
మందలించి యావేళనే మరీ నొక సోద్యము
అందుకొంటి వీడెము అపెచేత నీవు
(॥అప్ప॥)
కామించి చెక్కులు నొక్కి కడుఁ బాదాలకు మొక్కి
యేమికివీడుకొనె నీపె నిన్ను
దీమసాన నప్పటిని తేటపడె వేరొకటి
కోలమపుమోవి చవిగొంటివి సారెకును
(॥అప్ప॥)
సన్నలే సేసీ(సె?) నాపె సముకాన నుండి నీతో
యెన్నిక లెట్టివి కూట మెన్నఁ డబ్బెను
యిన్నిటా శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
పన్ని రతిఁ జొక్కిళి వాపడఁతిసేఁతలకు
(||pallavi||)
appaḍi tārugāṇa launo kāvo
tappaga yī gurudulu talam̐sugo nīvu
(||appa||)
iṁdām̐kā māḍalāḍĕ yĕravulega nīdo
yĕṁduṁḍi vachchĕ nābĕ yemo nīgu
maṁdaliṁchi yāveḽane marī nŏga sodyamu
aṁdugŏṁṭi vīḍĕmu abĕseda nīvu
(||appa||)
kāmiṁchi sĕkkulu nŏkki kaḍum̐ bādālagu mŏkki
yemigivīḍugŏnĕ nībĕ ninnu
dīmasāna nappaḍini teḍabaḍĕ verŏgaḍi
kolamabumovi savigŏṁṭivi sārĕgunu
(||appa||)
sannale sesī(sĕ?) nābĕ samugāna nuṁḍi nīdo
yĕnniga lĕṭṭivi kūḍa mĕnnam̐ ḍabbĕnu
yinniḍā śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
panni radim̐ jŏkkiḽi vābaḍam̐tisem̐talagu