అప్పటి సరసాలాడే రాపె నీవు నిస్సిరో
(॥పల్లవి॥)
అప్పటి సరసాలాడే రాపె నీవు నిస్సిరో
యెప్పటివలెనే వున్నా రిద్దరుఁ దక్కరులే
(॥అపటి॥)
కందువఁగన్నులు గంటే కౌఁగిలించవలెఁ గాక
ముందువెనక లెంచితే మోహమా యది
పొందుల మాటలాడితే పులకించవలెఁ గాక
యిందరివలె నుండితే యెగవులే కావా
(॥అపటి॥)
పక్కన నవ్వు నవ్వితే భ్రమయఁగవలెఁ గాక
వక్కణ లడుగఁబోతే వలపా యది
చిక్కని యెలుఁగు వింటే చెమరించవలెఁ గాక
చొక్క కుండితే వెలితి చూపుటే కాదా
(॥అపటి॥)
మేలమాడినంతలోనె మే మరువవలెఁ గాక
తాలిమి చేసుకొంటే తగులా యది
ఆలించి శ్రీవేంకటేశ అంతలో నన్నుఁ గూడితి
వీ లీలఁ గాక వుండితే యీడు జోడే కాదా
(||pallavi||)
appaḍi sarasālāḍe rābĕ nīvu nissiro
yĕppaḍivalĕne vunnā riddarum̐ dakkarule
(||abaḍi||)
kaṁduvam̐gannulu gaṁṭe kaum̐giliṁchavalĕm̐ gāga
muṁduvĕnaga lĕṁchide mohamā yadi
pŏṁdula māḍalāḍide pulagiṁchavalĕm̐ gāga
yiṁdarivalĕ nuṁḍide yĕgavule kāvā
(||abaḍi||)
pakkana navvu navvide bhramayam̐gavalĕm̐ gāga
vakkaṇa laḍugam̐bode valabā yadi
sikkani yĕlum̐gu viṁṭe sĕmariṁchavalĕm̐ gāga
sŏkka kuṁḍide vĕlidi sūbuḍe kādā
(||abaḍi||)
melamāḍinaṁtalonĕ me maruvavalĕm̐ gāga
tālimi sesugŏṁṭe tagulā yadi
āliṁchi śhrīveṁkaḍeśha aṁtalo nannum̐ gūḍidi
vī līlam̐ gāga vuṁḍide yīḍu joḍe kādā