Appadi nodambaadela adamdayyee ne nayye

అప్పటి నొడఁబాటేల అతఁడయ్యీ నే నయ్యే
Language

(॥పల్లవి॥)
అప్పటి నొడఁబాటేల అతఁడయ్యీ నే నయ్యే
వొప్పులుఁ దప్పులుఁ దీరె వుండరే మీరు

(॥అప్పటి॥)
బగ్గనఁ దానే యింకఁ బచ్చితిట్టు తిట్టినాఁడు
యెగ్గులు సిగ్గులుఁ బాసె నేలే యింక
వెగ్గళించి యేమన్నా వెల్లవిరులయ్యీ మాఁట
దగ్గరిరాఁ బనిలేదు తలరే మీరు

(॥అప్పటి॥)
నిమ్మపంట వేసినాఁడు నెట్టిన నాకొంగు దాఁకె
యెమ్మెలు నేతులుఁ జెల్లె నేలే యింక
కుమ్మరించి నవ్వఁబోతే గుట్టుచెడీ నిఁక నేఁడు
బొమ్మలజంకెలె చాలుఁబోరే మీరు

(॥అప్పటి॥)
చెక్కులు తా నొక్కినాఁడు చిత్తము నేఁ గరఁగితి
యెక్కువ తక్కువ దీరె నేలే యింక
అక్కరై శ్రీవేంకటేశుఁ డంతలోనె నన్నుఁ గూడె
మక్కళించె వలపులు మానరే మీరు

(||pallavi||)
appaḍi nŏḍam̐bāḍela adam̐ḍayyī ne nayye
vŏppulum̐ dappulum̐ dīrĕ vuṁḍare mīru

(||appaḍi||)
bagganam̐ dāne yiṁkam̐ bachchidiṭṭu tiṭṭinām̐ḍu
yĕggulu siggulum̐ bāsĕ nele yiṁka
vĕggaḽiṁchi yemannā vĕllavirulayyī mām̐ṭa
daggarirām̐ baniledu talare mīru

(||appaḍi||)
nimmabaṁṭa vesinām̐ḍu nĕṭṭina nāgŏṁgu dām̐kĕ
yĕmmĕlu nedulum̐ jĕllĕ nele yiṁka
kummariṁchi navvam̐bode guṭṭusĕḍī nim̐ka nem̐ḍu
bŏmmalajaṁkĕlĕ sālum̐bore mīru

(||appaḍi||)
sĕkkulu tā nŏkkinām̐ḍu sittamu nem̐ garam̐gidi
yĕkkuva takkuva dīrĕ nele yiṁka
akkarai śhrīveṁkaḍeśhum̐ ḍaṁtalonĕ nannum̐ gūḍĕ
makkaḽiṁchĕ valabulu mānare mīru