అప్పటి నిచ్చక మాడే వట్టె నాకు
(॥పల్లవి॥)
అప్పటి నిచ్చక మాడే వట్టె నాకు
తప్పని బొంకని మంచి తగవరి వౌదువు
(॥అప్పటి॥)
చాపలాన మాయిద్దరి జగడాలు దిద్దవచ్చి
ఆపెమాఁటె వంక లొత్తే వప్పటినీవు
తీపు నీ కామాఁట లైతే తిట్టించుకొందు గాని
పోపో నే నందు కోప పోటిదొర వౌదువు
(॥అప్పటి॥)
యెదుట మాకల్లా నిజ మేరుపరచఁగ వచ్చి
అదె పతివాది వయ్యే నప్పటినీవు
బెదరితే నీ వాకెకె ప్రియము చెప్పుదు గాని
కదిసి నన్నుఁ బట్టకు కడు జాణ వౌదువు
(॥అప్పటి॥)
వెడ్డు వెట్టి మమ్ము నేఁడు వేఁడుకొన నిటు వచ్చి
అడ్డము లాపెకు వచ్చే వప్పటినీవు
వొడ్డినకోపము దీర వొక రొకరిఁ గూడితి
వెడ్డవు గావు శ్రీ వెంకటేశ్వరుఁడ వౌదువు
(||pallavi||)
appaḍi nichchaga māḍe vaṭṭĕ nāgu
tappani bŏṁkani maṁchi tagavari vauduvu
(||appaḍi||)
sābalāna māyiddari jagaḍālu diddavachchi
ābĕmām̐ṭĕ vaṁka lŏtte vappaḍinīvu
tību nī kāmām̐ṭa laide tiṭṭiṁchugŏṁdu gāni
pobo ne naṁdu koba poḍidŏra vauduvu
(||appaḍi||)
yĕduḍa māgallā nija merubarasam̐ga vachchi
adĕ padivādi vayye nappaḍinīvu
bĕdaride nī vāgĕgĕ priyamu sĕppudu gāni
kadisi nannum̐ baṭṭagu kaḍu jāṇa vauduvu
(||appaḍi||)
vĕḍḍu vĕṭṭi mammu nem̐ḍu vem̐ḍugŏna niḍu vachchi
aḍḍamu lābĕgu vachche vappaḍinīvu
vŏḍḍinagobamu dīra vŏga rŏgarim̐ gūḍidi
vĕḍḍavu gāvu śhrī vĕṁkaḍeśhvarum̐ḍa vauduvu