Appadi nettamu joojamaadevu paraaguna

అప్పటి నెత్తము జూజమాడేవు పరాకున
Language

(॥పల్లవి॥)
అప్పటి నెత్తము జూజమాడేవు పరాకున
యిప్పుడు నీవద్ద నున్న దిదివో చెలి

(॥॥)
ముంచిముంటి నవ్వునవ్వీ మొగలి రేకుల కొప్పు
యించుకించుక గదల నిదివో చెలి
తుంచితుంచి నిన్ను వేసి తోరుపుఁబువ్వులదండ
ఇంచువిలుతునివలె నిదివో చెలి

(॥॥)
చిత్తగించి మాఁటలాడీ చెక్కులమెరుఁగు మించ
యెత్తినవదనముతో నిదివో చెలి
త త్తరించి వీఁపునఁ దనుపేరు వ్రాసీని
యిత్తల నేమీ నెఱఁగ దిదివో చెలి

(॥॥)
తొడమీఁదఁ దొడవేసీఁ దోరపుకుచము లానీ-
నెడనెడ నొత్తుతాను యిధివో చెలి
పడఁతి శ్రీ వేంకటేశ పరాకుమాని నిన్ను-
నెడయక గాఁగిలించె నిదివో చెలి

(||pallavi||)
appaḍi nĕttamu jūjamāḍevu parāguna
yippuḍu nīvadda nunna didivo sĕli

(||||)
muṁchimuṁṭi navvunavvī mŏgali regula kŏppu
yiṁchugiṁchuga gadala nidivo sĕli
tuṁchiduṁchi ninnu vesi torubum̐buvvuladaṁḍa
iṁchuviludunivalĕ nidivo sĕli

(||||)
sittagiṁchi mām̐ṭalāḍī sĕkkulamĕrum̐gu miṁcha
yĕttinavadanamudo nidivo sĕli
ta ttariṁchi vīm̐punam̐ danuberu vrāsīni
yittala nemī nĕṟam̐ga didivo sĕli

(||||)
tŏḍamīm̐dam̐ dŏḍavesīm̐ dorabugusamu lānī-
nĕḍanĕḍa nŏttudānu yidhivo sĕli
paḍam̐ti śhrī veṁkaḍeśha parāgumāni ninnu-
nĕḍayaga gām̐giliṁchĕ nidivo sĕli