అప్పటి నెరఁగనటే ఆడనున్నాఁడు
(॥పల్లవి॥)
అప్పటి నెరఁగనటే ఆడనున్నాఁడు
చెప్పేఁగాని తగబుద్ది చేరఁ బిల్వవే
(॥అప॥)
వొట్టుక యెవ్వతో చీర కట్టి విడిచినది నాఁ
పెట్టెలోనఁ బెట్టినాఁడు పిలువఁగదే
గుట్టుతోడ రాకున్న కొమ్మలిందరుఁ జూడఁగ
అట్టె కొంగువట్టి తీసి ఆనవెట్టవే
(॥అప॥)
బాలకి యెవ్వతో మెట్టి పాదానఁ బెట్టినది నా
వేలఁ బెట్టిపోయినాఁడు వేగఁ బిల్వవే
ఆలరి పరాకు సేసుకట్టె వుంటే నిందరిలో
వోలిఁ గొప్పువట్టి తీసి వొట్టు వెట్టివే
(॥అప॥)
యెవ్వతో బన్నసరము ఇదె నామెడ వేసెను
చివ్వన శ్రీ వేంకటేశుఁ జేరఁ బిల్వవే
మవ్వానా నన్ని దె కూడె మతకాన రాకున్న
రవ్వగాఁ జేవట్టి తీసి రచ్చవెట్టివే
(||pallavi||)
appaḍi nĕram̐ganaḍe āḍanunnām̐ḍu
sĕppem̐gāni tagabuddi seram̐ bilvave
(||aba||)
vŏṭṭuga yĕvvado sīra kaṭṭi viḍisinadi nām̐
pĕṭṭĕlonam̐ bĕṭṭinām̐ḍu piluvam̐gade
guṭṭudoḍa rāgunna kŏmmaliṁdarum̐ jūḍam̐ga
aṭṭĕ kŏṁguvaṭṭi tīsi ānavĕṭṭave
(||aba||)
bālagi yĕvvado mĕṭṭi pādānam̐ bĕṭṭinadi nā
velam̐ bĕṭṭiboyinām̐ḍu vegam̐ bilvave
ālari parāgu sesugaṭṭĕ vuṁṭe niṁdarilo
volim̐ gŏppuvaṭṭi tīsi vŏṭṭu vĕṭṭive
(||aba||)
yĕvvado bannasaramu idĕ nāmĕḍa vesĕnu
sivvana śhrī veṁkaḍeśhum̐ jeram̐ bilvave
mavvānā nanni dĕ kūḍĕ madagāna rāgunna
ravvagām̐ jevaṭṭi tīsi rachchavĕṭṭive