Appadi nene kobi namduru meeru

అప్పటి నేనే కోపి నందురు మీరు
Language

(॥పల్లవి॥)
అప్పటి నేనే కోపి నందురు మీరు
చెప్పరాని ఆతనిచేఁత లివి చూడరే

(॥అప్పటి॥)
నవ్వుతానె మంచితనము నెరుపుత గాక
యెవ్వరిమనసు లెట్టో యెరుఁగుదునా
పువ్వుల నే వేయఁగాను పూఁచి నిమ్మపంట వేసీ
దవ్వుల నుండి యాతని తగవులు చూడరే

(॥అప్పటి॥)
మొగము చూచి తనకు మొక్కఁ గలదానఁ గాక
యెగసక్కెము లవుట యెరుఁగుదునా
తగు వెన్నెలలోనికె తన్ను నేఁ బిలువఁ గాను
సగము చీఁకటిలోనె సన్న సేసెఁ జూడరే

(॥అప్పటి॥)
చెంది యిట్టె తనసేవ సేయఁ గలదానఁ గాక
యిందుకె నన్ను మెచ్చుట యెరుఁగుదునా
అందపు శ్రీవెంకటేశుఁ డన్నిటా నన్నుఁ గలసె
కందువలు గరఁగించి కడు మీరిఁ జూడరే

(||pallavi||)
appaḍi nene kobi naṁduru mīru
sĕpparāni ādanisem̐ta livi sūḍare

(||appaḍi||)
navvudānĕ maṁchidanamu nĕrubuda gāga
yĕvvarimanasu lĕṭṭo yĕrum̐gudunā
puvvula ne veyam̐gānu pūm̐si nimmabaṁṭa vesī
davvula nuṁḍi yādani tagavulu sūḍare

(||appaḍi||)
mŏgamu sūsi tanagu mŏkkam̐ galadānam̐ gāga
yĕgasakkĕmu lavuḍa yĕrum̐gudunā
tagu vĕnnĕlalonigĕ tannu nem̐ biluvam̐ gānu
sagamu sīm̐kaḍilonĕ sanna sesĕm̐ jūḍare

(||appaḍi||)
sĕṁdi yiṭṭĕ tanaseva seyam̐ galadānam̐ gāga
yiṁdugĕ nannu mĕchchuḍa yĕrum̐gudunā
aṁdabu śhrīvĕṁkaḍeśhum̐ ḍanniḍā nannum̐ galasĕ
kaṁduvalu garam̐giṁchi kaḍu mīrim̐ jūḍare