Appadi neeselu vamtayunu

అప్పటి నీచెలు వంతయును
Language

(॥పల్లవి॥)
అప్పటి నీచెలు వంతయును
కుప్పలుఁదెప్పలు కోరికలాయ

(॥అప్ప॥)
వాయలేక ననుఁ బలుమరుఁజూచే
సోయగంపునీచూపు లివి
సేయనిములుకులచిలుకలు మదనుని-
సాయకకోట్లచందములాయ

(॥అప్ప॥)
అడుగిడఁజాలక ఆడినమాటలె
బడిబడిఁ బలికేపలుకు లివి
జడిగొనుముత్యపుసరులై విరులై
విడువని వెన్నెలవేఁడియు లాయ

(॥అప్ప॥)
ముచ్చట వాయక మోహదాహమున-
నిచ్చేటి మోవులయీవు లివి
విచ్చనవిడి శ్రీవేంకటేశ నీ-
తచ్చనకూటపుతలపోఁతలాయ

(||pallavi||)
appaḍi nīsĕlu vaṁtayunu
kuppalum̐dĕppalu korigalāya

(||appa||)
vāyalega nanum̐ balumarum̐jūse
soyagaṁpunīsūbu livi
seyanimulugulasilugalu madanuni-
sāyagagoṭlasaṁdamulāya

(||appa||)
aḍugiḍam̐jālaga āḍinamāḍalĕ
baḍibaḍim̐ baligebalugu livi
jaḍigŏnumutyabusarulai virulai
viḍuvani vĕnnĕlavem̐ḍiyu lāya

(||appa||)
muchchaḍa vāyaga mohadāhamuna-
nichcheḍi movulayīvu livi
vichchanaviḍi śhrīveṁkaḍeśha nī-
tachchanagūḍabudalabom̐talāya