Appadi neeneramigi nadi saalunaa

అప్పటి నీనేరమికి నది చాలునా
Language

(॥పల్లవి॥)
అప్పటి నీనేరమికి నది చాలునా
చెప్పరాని సేవలెల్లాఁ జేతువుగాక

(॥అప్ప॥)
పంతపుమాటలయాపె పలకీనా నీతోను
వింతలుగా నీవెంత వేఁడుకొన్నాను
చెంతనుండి నీవు నిన్నఁ జేసినచేఁతలకు
మంతనపు మొక్కుల సమ్మతిసేతువుగాక

(॥అప్ప॥)
నాలిచలపాదియాపె నవ్వీనా నీతోను
యీలీల జాణతనా లెంతాడినాను
కోలుముందై నీమేన గుఱుతులుండినందుకు
యేలికెవై నా కందిఇత్తువుగాక

(॥అప్ప॥)
రాతిగుండెలమేల్మంగ యీతల నిఁక లోఁగీనా
కాతరాన నాడి యెంత కదిమినాను
యేతులశ్రీవేంకటేశ యెమ్మెలు చూపివందుకు
యీతల రొమ్ముపై నాపె నిడుకొందుగాక

(||pallavi||)
appaḍi nīneramigi nadi sālunā
sĕpparāni sevalĕllām̐ jeduvugāga

(||appa||)
paṁtabumāḍalayābĕ palagīnā nīdonu
viṁtalugā nīvĕṁta vem̐ḍugŏnnānu
sĕṁtanuṁḍi nīvu ninnam̐ jesinasem̐talagu
maṁtanabu mŏkkula sammadiseduvugāga

(||appa||)
nālisalabādiyābĕ navvīnā nīdonu
yīlīla jāṇadanā lĕṁtāḍinānu
kolumuṁdai nīmena guṟuduluṁḍinaṁdugu
yeligĕvai nā kaṁdiittuvugāga

(||appa||)
rādiguṁḍĕlamelmaṁga yīdala nim̐ka lom̐gīnā
kādarāna nāḍi yĕṁta kadiminānu
yedulaśhrīveṁkaḍeśha yĕmmĕlu sūbivaṁdugu
yīdala rŏmmubai nābĕ niḍugŏṁdugāga