(॥పల్లవి॥)
అప్పటి నీపంతముల కంటిఁగాక
యెప్పుడూ నీ వేలమానే వెట్టయినాఁ జేయరా
(॥అప్పటి॥)
తడవనివాఁడవేల తగిలేవు మావెంట
విడువిడు నాచెఱఁగు వెఱతు నీకు
బడినే వోయమ్మ మేను పరవశమయ్యీని
యెడపు నీచేఁత చెల్ల నెట్టైనాఁ జేయరా
(॥అప్పటి॥)
ఆనవెట్టుకొన్నవాఁడ వాడనేల మాట మాతో
మాను మాను సరసాలు మరినేల
నానెఁ జిరుచెమటల నవ్వువచ్చి నాకు నిట్టె
యే నేమి ననఁజాల నెట్టయినాఁ జేయరా
(॥అప్పటి॥)
అలిగినవాఁడ వేల అంకెలఁ గాఁగిలించేవు
నిలునిలు కొంతవడి నేఁ జెప్పేను
బలిమి శ్రీవేంకటేశ పైకొని బోగించితివి
యిల నే నీకే వలచి తెట్టయినాఁ జేయరా
(||pallavi||)
appaḍi nībaṁtamula kaṁṭim̐gāga
yĕppuḍū nī velamāne vĕṭṭayinām̐ jeyarā
(||appaḍi||)
taḍavanivām̐ḍavela tagilevu māvĕṁṭa
viḍuviḍu nāsĕṟam̐gu vĕṟadu nīgu
baḍine voyamma menu paravaśhamayyīni
yĕḍabu nīsem̐ta sĕlla nĕṭṭainām̐ jeyarā
(||appaḍi||)
ānavĕṭṭugŏnnavām̐ḍa vāḍanela māḍa mādo
mānu mānu sarasālu marinela
nānĕm̐ jirusĕmaḍala navvuvachchi nāgu niṭṭĕ
ye nemi nanam̐jāla nĕṭṭayinām̐ jeyarā
(||appaḍi||)
aliginavām̐ḍa vela aṁkĕlam̐ gām̐giliṁchevu
nilunilu kŏṁtavaḍi nem̐ jĕppenu
balimi śhrīveṁkaḍeśha paigŏni bogiṁchidivi
yila ne nīge valasi tĕṭṭayinām̐ jeyarā