Appadi nee suddulella adugam buttemche nannu

అప్పటి నీ సుద్దులెల్ల అడుగఁ బుత్తెంచె నన్ను
Language

(॥పల్లవి॥)
అప్పటి నీ సుద్దులెల్ల అడుగఁ బుత్తెంచె నన్ను
తప్పక చూచినవాఁడు తాఁ గాఁడా

(॥అప్ప॥)
నగుతా నండకు వచ్చి నాకు నాపెకును
తగవు చెప్పినవాఁడు తాఁ గాఁడా
జిగిమాపయ్యద లంటి సిగ్గుల నేము నవ్వఁగ
అగడు సేసినవాఁడు అప్పటి తాఁగాఁడా

(॥అప్ప॥)
జమళిపాన్పుమీద సరసాన నాపె నన్నుఁ
దమిరేఁచినవాఁడు తాఁగాఁడా
ప్రమదాన నిద్దరికి పంతములు సరిచేసి
తములమిడినవాడు తాఁగాఁడా

(॥అప్ప॥)
అరసి యక్కచెల్లెండ్లమైనను మ్మింతలోనే
దరిచేర్చి కూడినాఁడు తాఁగాఁడా
యిరవై శ్రీవేంకటేశుఁ డింటిలోననే వుండి
తిరమై మన్నించినాఁడు దేవుఁడు తాఁగాఁడా

(||pallavi||)
appaḍi nī suddulĕlla aḍugam̐ buttĕṁchĕ nannu
tappaga sūsinavām̐ḍu tām̐ gām̐ḍā

(||appa||)
nagudā naṁḍagu vachchi nāgu nābĕgunu
tagavu sĕppinavām̐ḍu tām̐ gām̐ḍā
jigimābayyada laṁṭi siggula nemu navvam̐ga
agaḍu sesinavām̐ḍu appaḍi tām̐gām̐ḍā

(||appa||)
jamaḽibānpumīda sarasāna nābĕ nannum̐
damirem̐sinavām̐ḍu tām̐gām̐ḍā
pramadāna niddarigi paṁtamulu sarisesi
tamulamiḍinavāḍu tām̐gām̐ḍā

(||appa||)
arasi yakkasĕllĕṁḍlamainanu mmiṁtalone
darisersi kūḍinām̐ḍu tām̐gām̐ḍā
yiravai śhrīveṁkaḍeśhum̐ ḍiṁṭilonane vuṁḍi
tiramai manniṁchinām̐ḍu devum̐ḍu tām̐gām̐ḍā