అప్పటి నీ చెలులచే నాగడానఁ బడనేల
(॥పల్లవి॥)
అప్పటి నీ చెలులచే నాగడానఁ బడనేల
మెప్పించేఁ గాని మేడమీఁదికి రారా
(॥॥)
సంగతిగాదు నీసతులెల్లాఁ జూచేరు
కొంగువట్టి తియ్యకురా కొసరి నన్ను
దొంగిలి చేసినసేఁత తుదకెక్కించ నేఁటికి
ముంగిటి వారెరిఁగేరు మూలకు రారా
(॥॥)
కన్నవారు విన్నవారుఁ గాకు సేసేరిట్టే నన్ను
చన్నులు ముట్టికురా సారెసారెకు
పన్ని చీఁకటిలో సుద్ది బయట వేయఁగనేల
మన్నించి దోమతెరమాటు కిట్టేరారా
(॥॥)
అప్పసము వురముపై నలమేల్మంగ వుండఁగా
కొప్పువట్టి తియ్యకురా కొంకక నన్ను
యిప్పుడే శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టే
చప్పుడు సేయక మంచముపైకి రారా
(||pallavi||)
appaḍi nī sĕlulase nāgaḍānam̐ baḍanela
mĕppiṁchem̐ gāni meḍamīm̐digi rārā
(||||)
saṁgadigādu nīsadulĕllām̐ jūseru
kŏṁguvaṭṭi tiyyagurā kŏsari nannu
dŏṁgili sesinasem̐ta tudagĕkkiṁcha nem̐ṭigi
muṁgiḍi vārĕrim̐geru mūlagu rārā
(||||)
kannavāru vinnavārum̐ gāgu seseriṭṭe nannu
sannulu muṭṭigurā sārĕsārĕgu
panni sīm̐kaḍilo suddi bayaḍa veyam̐ganela
manniṁchi domadĕramāḍu kiṭṭerārā
(||||)
appasamu vuramubai nalamelmaṁga vuṁḍam̐gā
kŏppuvaṭṭi tiyyagurā kŏṁkaga nannu
yippuḍe śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭe
sappuḍu seyaga maṁchamubaigi rārā