Appadi nannu nene aadugoraadu gaaga

అప్పటి నన్ను నేనే ఆడుకోరాదు గాక
Language

(॥పల్లవి॥)
అప్పటి నన్ను నేనే ఆడుకోరాదు గాక
ఇప్పుడిట్టే చెలులాల ఇదేమే నా గుణము

(॥॥)
చెలిమి సేసే నంటే జిగిగొనీ సిగ్గులు
తల వంచుకుండే నంటే తమి ఘనము
కొలువున నుండే నంటే గుబ్బతిలీ వలపులు
యెలమి నో చెలులాల యేఁటిదే నాగుణము

(॥॥)
కందువ మాటాడే నంటే గగ్గుత్తిక యయ్యీని
అంది సేవ సేసేనంటే చిందీఁ జెమటా
పందేలాడే నంటేఁ జూచి పరవశములు దొట్టి
ఇందరిలోఁ జెలులాల యేఁటిదే నా గుణము

(॥॥)
సరుఁస గూచుండే నంటే సంతోసాలే రేఁగీని
విరుల వేసే నంటే వీడీఁ గొప్పు
యిరవుగా శ్రీ వేంకటేశుఁ డిట్టే నన్నుఁగూడె
యెరవరి చెలులాల యేఁటిదే నా గుణము

(||pallavi||)
appaḍi nannu nene āḍugorādu gāga
ippuḍiṭṭe sĕlulāla ideme nā guṇamu

(||||)
sĕlimi sese naṁṭe jigigŏnī siggulu
tala vaṁchuguṁḍe naṁṭe tami ghanamu
kŏluvuna nuṁḍe naṁṭe gubbadilī valabulu
yĕlami no sĕlulāla yem̐ṭide nāguṇamu

(||||)
kaṁduva māḍāḍe naṁṭe gagguttiga yayyīni
aṁdi seva sesenaṁṭe siṁdīm̐ jĕmaḍā
paṁdelāḍe naṁṭem̐ jūsi paravaśhamulu dŏṭṭi
iṁdarilom̐ jĕlulāla yem̐ṭide nā guṇamu

(||||)
sarum̐sa gūsuṁḍe naṁṭe saṁtosāle rem̐gīni
virula vese naṁṭe vīḍīm̐ gŏppu
yiravugā śhrī veṁkaḍeśhum̐ ḍiṭṭe nannum̐gūḍĕ
yĕravari sĕlulāla yem̐ṭide nā guṇamu