Appadi nanneladige vaunogaadoyamtaa

అప్పటి నన్నేలడిగే వౌనోకాదోయంటా
Language

(॥పల్లవి॥)
అప్పటి నన్నేలడిగే వౌనోకాదోయంటా
నెప్పున నిన్నిందులోన నేరమెంచేవారమా

(॥అప్ప॥)
చెప్ప నేమున్నవి నీవు చిత్తగించినవియెల్లా
కప్పురపునో ళ్లఁ బొగడేవే కాక
తప్పు లెక్కడివి నీవు తగఁ జేసేపనులలో
కప్పి ఇందరును మెచ్చఁగలవే కాక

(॥అప్ప॥)
వెలుతులు గలవా నీవిద్య లిన్నిటి లోపల
కొలఁది మీరఁగ నిండుకొన్నవే కాక
యెలమి నవ్వేవా రెవ్వ రింతటి నీగుణాలకు
చెలరేఁగి రేఁగి సంతసించుటే కాక

(॥అప్ప॥)
మట్టు పెట్టనేది నీ మహిమ వెల్లివిరిసె
గుట్టున నీతోఁ బెనఁగుటేకాక
ఇట్టె శ్రీవేంకటేశ యెనసితి విదె నన్ను
ముట్టి యెప్పుడ నీకు మొక్కుటేకాక

(||pallavi||)
appaḍi nannelaḍige vaunogādoyaṁṭā
nĕppuna ninniṁdulona neramĕṁchevāramā

(||appa||)
sĕppa nemunnavi nīvu sittagiṁchinaviyĕllā
kappurabuno ḽlam̐ bŏgaḍeve kāga
tappu lĕkkaḍivi nīvu tagam̐ jesebanulalo
kappi iṁdarunu mĕchcham̐galave kāga

(||appa||)
vĕludulu galavā nīvidya linniḍi lobala
kŏlam̐di mīram̐ga niṁḍugŏnnave kāga
yĕlami navvevā rĕvva riṁtaḍi nīguṇālagu
sĕlarem̐gi rem̐gi saṁtasiṁchuḍe kāga

(||appa||)
maṭṭu pĕṭṭanedi nī mahima vĕllivirisĕ
guṭṭuna nīdom̐ bĕnam̐guḍegāga
iṭṭĕ śhrīveṁkaḍeśha yĕnasidi vidĕ nannu
muṭṭi yĕppuḍa nīgu mŏkkuḍegāga