Appadi naasabadevu amganalagu

అప్పటి నాసపడేవు అంగనలకు
Language

(॥పల్లవి॥)
అప్పటి నాసపడేవు అంగనలకు
పిప్పిగాఁ గొంగువట్టి పెనఁగేవా రెవ్వరు

(॥అప్ప॥)
తొడమీఁదఁ గూచుండి తొయ్యలి నీతో నవ్వఁగా
యెడ చొచ్చి మాటాడే దెవ్వతె యిఁక
విడువ కాపె నీవద్ద వెఁస గాచుకుండఁగాను
చిడుముడి నూడిగాలు సేసేవా రెవ్వరు

(॥అప్ప॥)
చనవున నెలయించి సన్న లాపె సేయఁగాను
యెనయ నిన్నుఁ బిలిచే దెవ్వతె ఇఁక
మునుపనే నిన్నుఁగోరి మోమే ఆపె చూడఁగాను
వొనర మందె మేళాన నొరసేవా రెవ్వరు

(॥అప్ప॥)
కాఁపురము సేసేయాపె కాఁగిలించుకుండఁగాను
యేపున నిన్నుఁ జెనకే దెవ్వతే యిఁక
ఆపె గూడె శ్రీవేంకటాద్రిఁ బ్రహ్లదవరద
కాపాడి నన్నేలితివి కాదనేవా రెవ్వరు

(||pallavi||)
appaḍi nāsabaḍevu aṁganalagu
pippigām̐ gŏṁguvaṭṭi pĕnam̐gevā rĕvvaru

(||appa||)
tŏḍamīm̐dam̐ gūsuṁḍi tŏyyali nīdo navvam̐gā
yĕḍa sŏchchi māḍāḍe dĕvvadĕ yim̐ka
viḍuva kābĕ nīvadda vĕm̐sa gāsuguṁḍam̐gānu
siḍumuḍi nūḍigālu sesevā rĕvvaru

(||appa||)
sanavuna nĕlayiṁchi sanna lābĕ seyam̐gānu
yĕnaya ninnum̐ bilise dĕvvadĕ im̐ka
munubane ninnum̐gori mome ābĕ sūḍam̐gānu
vŏnara maṁdĕ meḽāna nŏrasevā rĕvvaru

(||appa||)
kām̐puramu seseyābĕ kām̐giliṁchuguṁḍam̐gānu
yebuna ninnum̐ jĕnage dĕvvade yim̐ka
ābĕ gūḍĕ śhrīveṁkaḍādrim̐ brahladavarada
kābāḍi nannelidivi kādanevā rĕvvaru