Appadi naameemdane yabaraadhaalaa

అప్పటి నామీఁదనే యపరాధాలా
Language

(॥పల్లవి॥)
అప్పటి నామీఁదనే యపరాధాలా
తప్పులు మోపఁగరాదా తగిలి నీమీఁదను

(॥అప్ప॥)
అప్పుడు నీవాడిన్టియామాటలే నాకుఁ
జెప్పరాదా చెలులతోఁ జెలరేఁగి
ముప్పిరి నీమేననున్న మూఁకచంద్రవంకలెల్ల
రెప్పలెత్తి చూడరాదా రేసుదీర నాకును

(॥అప్ప॥)
సేసినట్టితొల్లిటినీసేఁతలు నాకడితాన
వ్రాసుకొనరాదా యేమి వహికెక్కను
మాసీమాయనియట్టి మచ్చములు నీకుండఁగా
వేసరక నవ్వరాదా వెతదీర నాకును

(॥అప్ప॥)
కలిగిననీగుణాలే కాంతలతో మెచ్చిమెచ్చి
తలపోసుకొనరాదా తమితోడను
యెలమి శ్రీవేంకటేశ యిప్పడిట్టె కూడితివి
చలము సాదించరాదా సమరతి నాకును

(||pallavi||)
appaḍi nāmīm̐dane yabarādhālā
tappulu mobam̐garādā tagili nīmīm̐danu

(||appa||)
appuḍu nīvāḍinṭiyāmāḍale nāgum̐
jĕpparādā sĕluladom̐ jĕlarem̐gi
muppiri nīmenanunna mūm̐kasaṁdravaṁkalĕlla
rĕppalĕtti sūḍarādā resudīra nāgunu

(||appa||)
sesinaṭṭidŏlliḍinīsem̐talu nāgaḍidāna
vrāsugŏnarādā yemi vahigĕkkanu
māsīmāyaniyaṭṭi machchamulu nīguṁḍam̐gā
vesaraga navvarādā vĕdadīra nāgunu

(||appa||)
kaliginanīguṇāle kāṁtalado mĕchchimĕchchi
talabosugŏnarādā tamidoḍanu
yĕlami śhrīveṁkaḍeśha yippaḍiṭṭĕ kūḍidivi
salamu sādiṁcharādā samaradi nāgunu