Appadi naagu mohimche vadiyum jaalaga neevu

అప్పటి నాకు మోహించే వదియుఁ జాలక నీవు
Language

(॥పల్లవి॥)
అప్పటి నాకు మోహించే వదియుఁ జాలక నీవు
ముప్పిరిగొనె నిట నీముందరఁ గోరికలు

(॥అప్పటి॥)
యివ్వల నావల నీకు నిద్దరు సతులపొందు
వువ్విళ్ళూరఁ గలిగెఁగా వొక్కమాటే
పువ్వులు దొంతరలై పూఁచుఁ గాక తనువులు
కువ్వని పేరులవలె గూడేది యరుదు

(॥అప్పటి॥)
ముద్దుముద్దు వలె నీకు మూఁకగొల్లితలపొందు
వొద్దనుండఁ గలిగెఁగా వొక్కమాటే
యెద్దులబంతి గట్టుదు రెందైనా మగువల
కొద్ది మీఁఱ బంతిగట్టి కూడేదే యరుదు

(॥అప్పటి॥)
బలిమి నన్నుఁ గలసి పదారువేలసతుల
వొలిసి కూడితివిగా వొక్కమాటే
కలగూరగంప గద్దు గాక శ్రీవేంకటేశ్వర
కులములొక్కటిగాఁ గూడేదే యరుదు

(||pallavi||)
appaḍi nāgu mohiṁche vadiyum̐ jālaga nīvu
muppirigŏnĕ niḍa nīmuṁdaram̐ gorigalu

(||appaḍi||)
yivvala nāvala nīgu niddaru sadulabŏṁdu
vuvviḽḽūram̐ galigĕm̐gā vŏkkamāḍe
puvvulu dŏṁtaralai pūm̐sum̐ gāga tanuvulu
kuvvani perulavalĕ gūḍedi yarudu

(||appaḍi||)
muddumuddu valĕ nīgu mūm̐kagŏllidalabŏṁdu
vŏddanuṁḍam̐ galigĕm̐gā vŏkkamāḍe
yĕddulabaṁti gaṭṭudu rĕṁdainā maguvala
kŏddi mīm̐ṟa baṁtigaṭṭi kūḍede yarudu

(||appaḍi||)
balimi nannum̐ galasi padāruvelasadula
vŏlisi kūḍidivigā vŏkkamāḍe
kalagūragaṁpa gaddu gāga śhrīveṁkaḍeśhvara
kulamulŏkkaḍigām̐ gūḍede yarudu