అప్పటి నాతో నేల అమరమాట లాడేవు
(॥పల్లవి॥)
అప్పటి నాతో నేల అమరమాట లాడేవు
తిప్పరాని నీ వలపు దిష్టమై వుండఁగను
(॥అప్పటి॥)
కప్పురవిడె మిచ్చితే కార మై తోఁచెగా
చోప్పుగ నీమో మాపె చూడకుండఁగా
దప్పి దేరే మోముతోడ దగ్గరి నే నుండఁగాను
చిప్పిల నీ మే నెల్లఁ జెమరించెఁగా
(॥అప్పటి॥)
వొగిఁ బన్నీరు చల్లితే వులివెచ్చ దోఁచెఁగా
నగి నగి ఆపె నీతో నాలి నేయఁగా
చిగురుచిత్తముతోనె చేత నిన్ను నంటఁగాను
మొగచా టై రతు లెల్ల మొన చూచెఁగా
(॥అప్పటి॥)
గందము వుయ్యగ నీకు కడుఁ బచ్చి దోఁచెఁగా
ముందరనే ఆపె నీకు మోవి యియ్యఁగా
యిందులోనె శ్రీవెంకటేశ నే నిన్నుఁ గూడితి
యిందరిలోనె నాపొందు యితవాయఁగా
(||pallavi||)
appaḍi nādo nela amaramāḍa lāḍevu
tipparāni nī valabu diṣhṭamai vuṁḍam̐ganu
(||appaḍi||)
kappuraviḍĕ michchide kāra mai tom̐sĕgā
soppuga nīmo mābĕ sūḍaguṁḍam̐gā
dappi dere momudoḍa daggari ne nuṁḍam̐gānu
sippila nī me nĕllam̐ jĕmariṁchĕm̐gā
(||appaḍi||)
vŏgim̐ bannīru sallide vulivĕchcha dom̐sĕm̐gā
nagi nagi ābĕ nīdo nāli neyam̐gā
sigurusittamudonĕ seda ninnu naṁṭam̐gānu
mŏgasā ṭai radu lĕlla mŏna sūsĕm̐gā
(||appaḍi||)
gaṁdamu vuyyaga nīgu kaḍum̐ bachchi dom̐sĕm̐gā
muṁdarane ābĕ nīgu movi yiyyam̐gā
yiṁdulonĕ śhrīvĕṁkaḍeśha ne ninnum̐ gūḍidi
yiṁdarilonĕ nābŏṁdu yidavāyam̐gā