(॥పల్లవి॥)
అప్పటి నాతో నీవు ఆడవలెనా
కప్పనేల పచ్చడము కాఁగి లుండఁగాను
(॥అప్పటి॥)
తప్పని నీ కృప నాపై తగిలి వున్నది గాన
ముప్పిరి నున్నవి నా మోముకళలు
నెప్పున నీ మహిమకు నేనె తారుకాణ
చెప్ప నేల నిఁక వేరె చేసి చూపఁగాను
(॥అప్పటి॥)
చెలఁగు నీ మాటలు నా చెవి సోఁకినవి గాన
పులకలు నా మేనఁ బొది గొన్నవి
అలరు నీ మంచితనాలన్నిటికి నే గురతు
తెలుప వలెనా వేరె దిష్టమై యండఁగను
(॥అప్పటి॥)
అందపు నీ కూటమి నా కమరి వున్నది గాన
సందడించి నాలోని సంతంసా లేల
యిందు మనలో శ్రీవెంకటేశ యివె కారణము
చెందఁగ వలెనా వేర చేకొ నుండఁగాను
(||pallavi||)
appaḍi nādo nīvu āḍavalĕnā
kappanela pachchaḍamu kām̐gi luṁḍam̐gānu
(||appaḍi||)
tappani nī kṛpa nābai tagili vunnadi gāna
muppiri nunnavi nā momugaḽalu
nĕppuna nī mahimagu nenĕ tārugāṇa
sĕppa nela nim̐ka verĕ sesi sūbam̐gānu
(||appaḍi||)
sĕlam̐gu nī māḍalu nā sĕvi som̐kinavi gāna
pulagalu nā menam̐ bŏdi gŏnnavi
alaru nī maṁchidanālanniḍigi ne guradu
tĕluba valĕnā verĕ diṣhṭamai yaṁḍam̐ganu
(||appaḍi||)
aṁdabu nī kūḍami nā kamari vunnadi gāna
saṁdaḍiṁchi nāloni saṁtaṁsā lela
yiṁdu manalo śhrīvĕṁkaḍeśha yivĕ kāraṇamu
sĕṁdam̐ga valĕnā vera segŏ nuṁḍam̐gānu