Appadi naa taamaga mattumdem gaaga mari

అప్పటి నా తామక మట్టుండెఁ గాక మరి
Language

(॥పల్లవి॥)
అప్పటి నా తామక మట్టుండెఁ గాక మరి
నెప్పున నీవల్లను నేర మే మున్నది

(॥అప్ప॥)
కొనమొద లెరఁగక కోపగించుకొంటిఁ గాక
ననిచి నీతో నే నవ్వవలదా
పనిమాలి వూరకే పంతము లాడితిఁ గాక
మునుప నీపాదాలకు మొక్కవలదా

(॥అప్ప॥)
దయ లేక నే నిన్ను తక్కక తిట్టితిఁ గాక
రయమున నిన్నట్టే రమ్మనవద్దా
క్రియ యెరఁగక నిన్ను కేలు వట్టుకొంటిఁ గాక
ప్రియాన నీసేవ చేసి బెరయఁగవలదా

(॥అప్ప॥)
కన్నులకాఁక నిన్నుఁ కడు జంకించితిఁ గాక
యిన్నిటా శ్రీవేంకటేశ యిటు నన్నుఁ గూడితివి
వున్నతి నిన్నుఁ బొగడి వుండవలదా
నిన్ను నన్ను నెంచుకొని నిండు కుండవలదా

(||pallavi||)
appaḍi nā tāmaga maṭṭuṁḍĕm̐ gāga mari
nĕppuna nīvallanu nera me munnadi

(||appa||)
kŏnamŏda lĕram̐gaga kobagiṁchugŏṁṭim̐ gāga
nanisi nīdo ne navvavaladā
panimāli vūrage paṁtamu lāḍidim̐ gāga
munuba nībādālagu mŏkkavaladā

(||appa||)
daya lega ne ninnu takkaga tiṭṭidim̐ gāga
rayamuna ninnaṭṭe rammanavaddā
kriya yĕram̐gaga ninnu kelu vaṭṭugŏṁṭim̐ gāga
priyāna nīseva sesi bĕrayam̐gavaladā

(||appa||)
kannulagām̐ka ninnum̐ kaḍu jaṁkiṁchidim̐ gāga
yinniḍā śhrīveṁkaḍeśha yiḍu nannum̐ gūḍidivi
vunnadi ninnum̐ bŏgaḍi vuṁḍavaladā
ninnu nannu nĕṁchugŏni niṁḍu kuṁḍavaladā