అప్పటి మమ్ముఁ జెనకే వాసోదకాఁడవు నీవు
(॥పల్లవి॥)
అప్పటి మమ్ముఁ జెనకే వాసోదకాఁడవు నీవు
చప్పఁగా గరివడ్డ పెసరుగింజవయ్యా
(॥అప్ప॥)
అలిగించుకొంటా వెంగే లట్టె యాడించుకొంటా
వెలఁది యొకతెచేత వేగించరాదు
పలువురు గొల్లమంకు భామలబారిఁ జిక్కి
బలిమినెట్లా వెళ్లఁబడితివయ్యా
(॥అప్ప॥)
చన్నుల నొత్తించుకొంటా సారె జంకింపించుకొంటా
కన్నె వొక్కతె కాఁగిటఁ గరఁగరాదు
పన్నినపదారువేలపంతాలకు లోనై
ఇన్నిటా నెట్ల ధరియించితివయ్యా
(॥అప్ప॥)
చెందినరతికేలిని శ్రీవేంకటేశ్వర
పొంది యొక్కతె మెప్పించి భోగించరాదు
యిందరిరూపులైన యిందిరను నన్ను నేలి
అందపు వేడుకల నెట్టలరితివయ్యా
(||pallavi||)
appaḍi mammum̐ jĕnage vāsodagām̐ḍavu nīvu
sappam̐gā garivaḍḍa pĕsarugiṁjavayyā
(||appa||)
aligiṁchugŏṁṭā vĕṁge laṭṭĕ yāḍiṁchugŏṁṭā
vĕlam̐di yŏgadĕseda vegiṁcharādu
paluvuru gŏllamaṁku bhāmalabārim̐ jikki
baliminĕṭlā vĕḽlam̐baḍidivayyā
(||appa||)
sannula nŏttiṁchugŏṁṭā sārĕ jaṁkiṁpiṁchugŏṁṭā
kannĕ vŏkkadĕ kām̐giḍam̐ garam̐garādu
panninabadāruvelabaṁtālagu lonai
inniḍā nĕṭla dhariyiṁchidivayyā
(||appa||)
sĕṁdinaradigelini śhrīveṁkaḍeśhvara
pŏṁdi yŏkkadĕ mĕppiṁchi bhogiṁcharādu
yiṁdarirūbulaina yiṁdiranu nannu neli
aṁdabu veḍugala nĕṭṭalaridivayyā