అప్పటి మానవు వేసా లంతేకాక
(॥పల్లవి॥)
అప్పటి మానవు వేసా లంతేకాక
చెప్పగలది నీ సేవ సేయుటింతెకాక
(॥అప్ప॥)
ఆడ నీడ నేర్చుకొన్న ఆనలేల పెట్టేవు
వేడుక కాఁడవు నీతో వెంగె మాడేవు
జాడతో నింతపనికి సరివారమా నీతో
వాడిక నీమన్ననలో వార మింతేకాక
(॥అప్ప॥)
యిచ్చకాలు సేసి నన్ను నేల వొడఁబరచేవు
వచ్చి వచ్చి నీతో నేము వాదువెట్టేమా
నిచ్చ నీ వంతవెరవ నీకంటె నెక్కుడా
వచ్చి వచ్చి నీచేతిలోవార మింతెకాక
(॥అప్ప॥)
నన్నుఁ జూచి నీ వప్పటి నవ్వు లేల నవ్వేవు
మిన్నక యేమైనా నీకు మేనవారమా
యెన్నికతో శ్రీవేంకటేశ నన్ను నేలితివి
వన్నెల నీవూడిగేలవార మింతె కాక
(||pallavi||)
appaḍi mānavu vesā laṁtegāga
sĕppagaladi nī seva seyuḍiṁtĕgāga
(||appa||)
āḍa nīḍa nersugŏnna ānalela pĕṭṭevu
veḍuga kām̐ḍavu nīdo vĕṁgĕ māḍevu
jāḍado niṁtabanigi sarivāramā nīdo
vāḍiga nīmannanalo vāra miṁtegāga
(||appa||)
yichchagālu sesi nannu nela vŏḍam̐barasevu
vachchi vachchi nīdo nemu vāduvĕṭṭemā
nichcha nī vaṁtavĕrava nīgaṁṭĕ nĕkkuḍā
vachchi vachchi nīsedilovāra miṁtĕgāga
(||appa||)
nannum̐ jūsi nī vappaḍi navvu lela navvevu
minnaga yemainā nīgu menavāramā
yĕnnigado śhrīveṁkaḍeśha nannu nelidivi
vannĕla nīvūḍigelavāra miṁtĕ kāga