అప్పటి మానవు వెంగే లదేమే నీవు
(॥పల్లవి॥)
అప్పటి మానవు వెంగే లదేమే నీవు
కుప్పలైన వలపుల గురిగాఁ జూచేవు
(॥॥)
వద్దే నాతో నింకా వట్టిసటజంకెనలు
గద్దించి తీసిన లోనుగాక మానేవా
కద్దే నావంకఁ దప్పు కప్రవిడె మిచ్చినది
వొద్దిక మదనమెత్తి వొకటొక టాడేవు
(॥॥)
పోపో నాతోనేల పొద్దువోనియానలు
చూపుల నాయమంటితే చొక్కకుండేవా
కాపాడి గుబ్బలఁ గొంగుగప్పినది నేరమీ
తీపులపెదవి వంచి తిట్టేవు లోలోనే
(॥॥)
రావే నాయెడనేలే రతిలో నీ గుట్లు
మోవి నిన్నుఁ జెనకితే మొక్కకుండేవా
యీవేళనే శ్రీ వేంకటేశుఁడ నేఁ గలసితి
తోవ నలమ్మేలంగవు తొక్కేవు పాదములు
(||pallavi||)
appaḍi mānavu vĕṁge lademe nīvu
kuppalaina valabula gurigām̐ jūsevu
(||||)
vadde nādo niṁkā vaṭṭisaḍajaṁkĕnalu
gaddiṁchi tīsina lonugāga mānevā
kadde nāvaṁkam̐ dappu kapraviḍĕ michchinadi
vŏddiga madanamĕtti vŏgaḍŏga ṭāḍevu
(||||)
pobo nādonela pŏdduvoniyānalu
sūbula nāyamaṁṭide sŏkkaguṁḍevā
kābāḍi gubbalam̐ gŏṁgugappinadi neramī
tībulabĕdavi vaṁchi tiṭṭevu lolone
(||||)
rāve nāyĕḍanele radilo nī guṭlu
movi ninnum̐ jĕnagide mŏkkaguṁḍevā
yīveḽane śhrī veṁkaḍeśhum̐ḍa nem̐ galasidi
tova nalammelaṁgavu tŏkkevu pādamulu