Appadi maanavu naabai naanavettevu

అప్పటి మానవు నాపై నానవెట్టేవు
Language

(॥పల్లవి॥)
అప్పటి మానవు నాపై నానవెట్టేవు
యెప్పటి నీగుణములు యెందుఁ గొత్తలౌనా

(॥అప్ప॥)
నిన్నటివునుకుల నీజాడలెల్లఁ గంటిమి
అన్నియు నాతో నీ వాడవలెనా
యెన్నరానిబాసలెల్ల యేల మనఇద్దరిలో
సన్నకు సన్నలే చాలుచాలు నుండరా

(॥అప్ప॥)
అటువంటివాఁడవని అంటినా నిన్నేమైనా
కటకట ఇంతకెల్లఁ గలనా నేను
కిటుకుఁగూటమికంటె కిందటి మనపొందు
లటు దలఁచుకొనుట అదియే మేలు

(॥అప్ప॥)
యింతలోనే యేమిదప్పె యెట్లైన నేమాయ
ఇంత నన్ను బుజ్జగించే విది వలెనా
చెంతలఁ గూడితి నన్ను శ్రీవేంకటేశ్వర
యింతి నింతే నీకు నే నెదురాడేనా

(||pallavi||)
appaḍi mānavu nābai nānavĕṭṭevu
yĕppaḍi nīguṇamulu yĕṁdum̐ gŏttalaunā

(||appa||)
ninnaḍivunugula nījāḍalĕllam̐ gaṁṭimi
anniyu nādo nī vāḍavalĕnā
yĕnnarānibāsalĕlla yela mana̮iddarilo
sannagu sannale sālusālu nuṁḍarā

(||appa||)
aḍuvaṁṭivām̐ḍavani aṁṭinā ninnemainā
kaḍagaḍa iṁtagĕllam̐ galanā nenu
kiḍugum̐gūḍamigaṁṭĕ kiṁdaḍi manabŏṁdu
laḍu dalam̐sugŏnuḍa adiye melu

(||appa||)
yiṁtalone yemidappĕ yĕṭlaina nemāya
iṁta nannu bujjagiṁche vidi valĕnā
sĕṁtalam̐ gūḍidi nannu śhrīveṁkaḍeśhvara
yiṁti niṁte nīgu ne nĕdurāḍenā