Appadi maanavu bimkaa launayyaa

అప్పటి మానవు బింకా లౌనయ్యా
Language

(॥పల్లవి॥)
అప్పటి మానవు బింకా లౌనయ్యా
కప్పేవు పచ్చడ మిట్టె కమ్మటి నౌనయ్యా

(॥అప్ప॥)
వూని రేపుమాపుదాఁకా వూరెల్లాఁ దిరిగి వచ్చి
ఆనలు వెట్టవచ్చేవు అవునయ్యా
మానాన మణిఁగి నే మౌనముతో నుండఁగాను
కానీ కానిమ్మనేవు కమ్మటి నౌనయ్యా

(॥అప్ప॥)
పొద్దువోనివాఁడ విట్టే పోకలనెల్లాఁ బోయి
అద్దము చూపుమనేపు ఔనయ్యా
నిద్దురతోఁ బానువుపై నే నిట్టె వుండఁగాను
గద్దించి అయా లంటేవు కమ్మటి నౌనయ్యా

(॥అప్ప॥)
కాంతలఇద్దరిలోనికనుసన్న దెలిపితే
అంతేపో నవ్వునవ్వే వౌనయ్యా
చింతదీర నన్నుఁగూడి శ్రీవేంకటేశ నేఁడు
కంతుముద్రలు మోపేవు కమ్మటి నౌనయ్యా

(||pallavi||)
appaḍi mānavu biṁkā launayyā
kappevu pachchaḍa miṭṭĕ kammaḍi naunayyā

(||appa||)
vūni rebumābudām̐kā vūrĕllām̐ dirigi vachchi
ānalu vĕṭṭavachchevu avunayyā
mānāna maṇim̐gi ne maunamudo nuṁḍam̐gānu
kānī kānimmanevu kammaḍi naunayyā

(||appa||)
pŏdduvonivām̐ḍa viṭṭe pogalanĕllām̐ boyi
addamu sūbumanebu aunayyā
nidduradom̐ bānuvubai ne niṭṭĕ vuṁḍam̐gānu
gaddiṁchi ayā laṁṭevu kammaḍi naunayyā

(||appa||)
kāṁtala̮iddariloniganusanna dĕlibide
aṁtebo navvunavve vaunayyā
siṁtadīra nannum̐gūḍi śhrīveṁkaḍeśha nem̐ḍu
kaṁtumudralu mobevu kammaḍi naunayyā