Appadi maanavu beeraala deme neevu

అప్పటి మానవు బీరాల దేమే నీవు
Language

(॥పల్లవి॥)
అప్పటి మానవు బీరాల దేమే నీవు
యిప్పు డేమి దప్పి పోయ నిఁకఁ జూడ రాదా

(॥అప్పటి॥)
యేతు నీకుఁ గలిగితే నెందైనాఁ జూపుదు గాక
ఆతని నావద్దఁ దిట్టే వదేమే నీవు
నీ తెరువు వచ్చితిమా నీ కేమి గారణమె
తోతో నా రమణుని దూరుదు గాక

(॥అప్పటి॥)
బలువు గలిగితేను బతుకుదు గా కతని
అలమేవు నా యెదుట నదేమే నీవు
తలవే నిన్నుఁ దడవ దగ్గరి నాయకుని
వలసినట్టు సేసితే వద్దనేవా నీవు

(॥అప్పటి॥)
వాసి నీకుఁ గలితేను వద్దఁ బెట్టుకుందు గాక
ఆస పడేవు నాపతి కదేమే నీవు
యీసరి శ్రీవెంకటేశుఁ డిందరిఁ గూడినమీఁద
గోస నాస నేయఁ బోతే కోప మేలే నీకు

(||pallavi||)
appaḍi mānavu bīrāla deme nīvu
yippu ḍemi dappi poya nim̐kam̐ jūḍa rādā

(||appaḍi||)
yedu nīgum̐ galigide nĕṁdainām̐ jūbudu gāga
ādani nāvaddam̐ diṭṭe vademe nīvu
nī tĕruvu vachchidimā nī kemi gāraṇamĕ
todo nā ramaṇuni dūrudu gāga

(||appaḍi||)
baluvu galigidenu badugudu gā kadani
alamevu nā yĕduḍa nademe nīvu
talave ninnum̐ daḍava daggari nāyaguni
valasinaṭṭu seside vaddanevā nīvu

(||appaḍi||)
vāsi nīgum̐ galidenu vaddam̐ bĕṭṭuguṁdu gāga
āsa paḍevu nābadi kademe nīvu
yīsari śhrīvĕṁkaḍeśhum̐ ḍiṁdarim̐ gūḍinamīm̐da
gosa nāsa neyam̐ bode koba mele nīgu