Appadi maanavu beeraa lamdarilonaa

అప్పటి మానవు బీరా లందరిలోనా
Language

(॥పల్లవి॥)
అప్పటి మానవు బీరా లందరిలోనా
చెప్పనేల లోలో నీకే సిగ్గువడవలదా

(॥అప్ప॥)
అదె మోవి గంటిరేఁగీ నానలేలపెట్టేవు
యెదిరి వారిందుకెల్లా నెట్టు నమ్మేరు
మదిమది నీచేఁతలే మచ్చము పట్టియ్యఁగాను
చెదరక నీకునీవే సిగ్గుపడవలదా

(॥అప్ప॥)
వేలిమట్టె లొరసీని వెసఁ జెక్కేల నొక్కేవు
అలరిచెలు లిందుకు అట్టె నవ్వరా
సోలి నీసంగారాలే చొప్పులైఇయ్యఁగాను
జీలుగుబెండాయ గుట్టు సిగ్గువడవలదా

(॥అప్ప॥)
అలవేలుమంగవొత్తీ వదేల కాఁగిలించేవు
వలచినవారికి వాసివుట్టదా
బలుశ్రీవేంకటేశ నీభావమే పట్టియ్యఁగాను
చెలఁగి నన్నేలితివి సిగ్గువడవలదా

(||pallavi||)
appaḍi mānavu bīrā laṁdarilonā
sĕppanela lolo nīge sigguvaḍavaladā

(||appa||)
adĕ movi gaṁṭirem̐gī nānalelabĕṭṭevu
yĕdiri vāriṁdugĕllā nĕṭṭu nammeru
madimadi nīsem̐tale machchamu paṭṭiyyam̐gānu
sĕdaraga nīgunīve siggubaḍavaladā

(||appa||)
velimaṭṭĕ lŏrasīni vĕsam̐ jĕkkela nŏkkevu
alarisĕlu liṁdugu aṭṭĕ navvarā
soli nīsaṁgārāle sŏppulaiiyyam̐gānu
jīlugubĕṁḍāya guṭṭu sigguvaḍavaladā

(||appa||)
alavelumaṁgavŏttī vadela kām̐giliṁchevu
valasinavārigi vāsivuṭṭadā
baluśhrīveṁkaḍeśha nībhāvame paṭṭiyyam̐gānu
sĕlam̐gi nannelidivi sigguvaḍavaladā