Appadi maanaru beeraalamte kaadaa

అప్పటి మానరు బీరాలంతే కాదా
Language

(॥పల్లవి॥)
అప్పటి మానరు బీరాలంతే కాదా
యిప్పటి మీ వొట్లు యెందాఁకా విందుము

(॥అప్ప॥)
తమ్మిపూవులవాట్లే తప్పించుకోఁ బట్టె మాకు
యిమ్ములనలిగిన మీయిద్దరిచేత
నమ్మరెంతైనా మాట నడుమ చెలులమింతే
యెమ్మెల మీ ముంగోపమెందాఁకాఁ జాతుము

(॥అప్ప॥)
వద్దనుండి మీమాటల వంకలు దిద్దనే పట్టె
యిద్దరుఁ బట్టేటి మీ యెగ్గులలోన
గద్దించేరు నేము మీకు కలిమిలో వారమైతే
యిద్దివో మీ పంతాల కెందాఁకా లోనౌదుము

(॥అప్ప॥)
చేతులుఁ జేతులు వట్టి చేరఁ దియ్యఁ బట్టె మాకు
యీతల మీరు గలసే రేసులలోన
రాతిరి శ్రీవేంకటేశ రమణిఁ గూడితిరిదె
యీ తగవు లీతలఁపు లెందాఁకా మెత్తుము

(||pallavi||)
appaḍi mānaru bīrālaṁte kādā
yippaḍi mī vŏṭlu yĕṁdām̐kā viṁdumu

(||appa||)
tammibūvulavāṭle tappiṁchugom̐ baṭṭĕ māgu
yimmulanaligina mīyiddariseda
nammarĕṁtainā māḍa naḍuma sĕlulamiṁte
yĕmmĕla mī muṁgobamĕṁdām̐kām̐ jādumu

(||appa||)
vaddanuṁḍi mīmāḍala vaṁkalu diddane paṭṭĕ
yiddarum̐ baṭṭeḍi mī yĕggulalona
gaddiṁcheru nemu mīgu kalimilo vāramaide
yiddivo mī paṁtāla kĕṁdām̐kā lonaudumu

(||appa||)
sedulum̐ jedulu vaṭṭi seram̐ diyyam̐ baṭṭĕ māgu
yīdala mīru galase resulalona
rādiri śhrīveṁkaḍeśha ramaṇim̐ gūḍidiridĕ
yī tagavu līdalam̐pu lĕṁdām̐kā mĕttumu