Appadi maadodi pomdu laasabadevu

అప్పటి మాతోడి పొందు లాసపడేవు
Language

(॥పల్లవి॥)
అప్పటి మాతోడి పొందు లాసపడేవు
కప్పరము నీ వియ్యఁగా కాదు గూడదనేమా

(॥అప్ప॥)
జంకెన చూపులఁ జూచి జాజరపాటలు వాడి
అంకెలకుఁ దెచ్చుకొనె నాపె నిన్నును
కుంకుమ గుబ్బలు సోఁక కొనగోరఁ గొప్ప దువ్వి
కొంకక యిన్నిటా దక్కఁగొనెఁ గదవయ్యా

(॥అప్ప॥)
సెలవుల నవ్వు నవ్వి చేతులు నీపైఁ జాఁచి
వలపించుకొనెఁగా వనిత నిన్ను
సొలపుల మాటలనే చుట్టరికములు సేసి
యెలమి నిన్నింత యెలయించెఁగదవయ్యా

(॥అప్ప॥)
విడెము చేతికిచ్చి వేమారు సరసమాడి
వాడికె సేసుకొనెను వైపుగా నిన్ను
యీడనె శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
జాడతోఁ దా నీపై సేస చల్లెఁగదవయ్యా

(||pallavi||)
appaḍi mādoḍi pŏṁdu lāsabaḍevu
kapparamu nī viyyam̐gā kādu gūḍadanemā

(||appa||)
jaṁkĕna sūbulam̐ jūsi jājarabāḍalu vāḍi
aṁkĕlagum̐ dĕchchugŏnĕ nābĕ ninnunu
kuṁkuma gubbalu som̐ka kŏnagoram̐ gŏppa duvvi
kŏṁkaga yinniḍā dakkam̐gŏnĕm̐ gadavayyā

(||appa||)
sĕlavula navvu navvi sedulu nībaim̐ jām̐si
valabiṁchugŏnĕm̐gā vanida ninnu
sŏlabula māḍalane suṭṭarigamulu sesi
yĕlami ninniṁta yĕlayiṁchĕm̐gadavayyā

(||appa||)
viḍĕmu sedigichchi vemāru sarasamāḍi
vāḍigĕ sesugŏnĕnu vaibugā ninnu
yīḍanĕ śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
jāḍadom̐ dā nībai sesa sallĕm̐gadavayyā