Appadi maadalu needo naademgaaga

అప్పటి మాటలు నీతో నాడేఁగాక
Language

(॥పల్లవి॥)
అప్పటి మాటలు నీతో నాడేఁగాక
కప్పిన నీమేను చూచి కాఁక రేఁగ కుండునా

(॥అప్ప॥)
వినయపుఁ జేఁతలను వేసాలమొక్కులను
ననుపు సేక కొంత నవ్వేఁ గాక
చెనకి నీవు కిమ్ములఁ జేసిన చేఁతలు వింట
కొనకన్నులనే నాకు కోపము రాకుండునా

(॥అప్ప॥)
వట్టిసరసములను వాడికెచుట్టరికేల
బెట్టుగ నీకొంగు వట్టి పెనఁగేఁ గాక
వుట్టిపడ నీ వుండేటివునికిఁ దలఁచుకొంటే
తిట్టు లేవైనా నోటికిఁ దిరము గాకుండునా

(॥అప్ప॥)
వింతవింతరతులను వెలలేనిమోహముల
పొంతనాల నిన్నుఁగూడి పొదిగేఁ గాక
యింతట శ్రీ వేంకటేశ యిప్పటి నిన్నొరసితే
పొంతనే నిలువు నాకుఁ బులకించకుండునా

(||pallavi||)
appaḍi māḍalu nīdo nāḍem̐gāga
kappina nīmenu sūsi kām̐ka rem̐ga kuṁḍunā

(||appa||)
vinayabum̐ jem̐talanu vesālamŏkkulanu
nanubu sega kŏṁta navvem̐ gāga
sĕnagi nīvu kimmulam̐ jesina sem̐talu viṁṭa
kŏnagannulane nāgu kobamu rāguṁḍunā

(||appa||)
vaṭṭisarasamulanu vāḍigĕsuṭṭarigela
bĕṭṭuga nīgŏṁgu vaṭṭi pĕnam̐gem̐ gāga
vuṭṭibaḍa nī vuṁḍeḍivunigim̐ dalam̐sugŏṁṭe
tiṭṭu levainā noḍigim̐ diramu gāguṁḍunā

(||appa||)
viṁtaviṁtaradulanu vĕlalenimohamula
pŏṁtanāla ninnum̐gūḍi pŏdigem̐ gāga
yiṁtaḍa śhrī veṁkaḍeśha yippaḍi ninnŏraside
pŏṁtane niluvu nāgum̐ bulagiṁchaguṁḍunā