అప్పటి లేదని బొంకే వా సుద్ది నీవు
(॥పల్లవి॥)
అప్పటి లేదని బొంకే వా సుద్ది నీవు
చెప్పనేల నీకు నివి చెల్లుబడి గావా
(॥అప్పటి॥)
మక్కువతో నాపెతొడ మాటలాడవా యప్పుడు
చెక్కచెమట నీ గోరఁ జిమ్ముతా నీవు
అక్కడ నేమో సుద్దు లడుగుతా నుండవా
తిక్కుముత్యాలచిక్కు దిద్దుకొంటా నీవు
(॥అప్పటి॥)
ఆదరించి యాకెమోము అప్పుడు చూచి నగవా
గాదిలి పయ్యదకొంగు గప్పుతా నీవు
సేదదేర బుజముపైఁ జేయి వేయవా నీవు
ఆదెసఁ బచ్చిమాట లాడుకొంటా నీవు
(॥అప్పటి॥)
నిలుచుండే కౌఁగిలించి నీవు మోవి యియ్యవా
పలుమారు నాకె చేయి పట్టుతా నీవు
యెలమి శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
అలమేలుమంగ నని యంగవించి నీవూ
(||pallavi||)
appaḍi ledani bŏṁke vā suddi nīvu
sĕppanela nīgu nivi sĕllubaḍi gāvā
(||appaḍi||)
makkuvado nābĕdŏḍa māḍalāḍavā yappuḍu
sĕkkasĕmaḍa nī goram̐ jimmudā nīvu
akkaḍa nemo suddu laḍugudā nuṁḍavā
tikkumutyālasikku diddugŏṁṭā nīvu
(||appaḍi||)
ādariṁchi yāgĕmomu appuḍu sūsi nagavā
gādili payyadagŏṁgu gappudā nīvu
sedadera bujamubaim̐ jeyi veyavā nīvu
ādĕsam̐ bachchimāḍa lāḍugŏṁṭā nīvu
(||appaḍi||)
nilusuṁḍe kaum̐giliṁchi nīvu movi yiyyavā
palumāru nāgĕ seyi paṭṭudā nīvu
yĕlami śhrīveṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
alamelumaṁga nani yaṁgaviṁchi nīvū