అప్పటి కోపాన నన్నీ నంటి నేను
(॥పల్లవి॥)
అప్పటి కోపాన నన్నీ నంటి నేను
తప్పులన్నీఁ దేరెను దండకు రమ్మనవే
(॥అప్పటి॥)
సంకెలెల్లాఁ దీరెను సరసుఁడు తానె వచ్చె
మంకుఁదనము మానితి మాటలాడవే
ఇంకా నేడసుద్దు లేమిసేసినాఁ జెల్లె
పంకించక చేతికి బాగాలియ్యవే
(॥అప్పటి॥)
మనసు నిర్మలమాయ మన్ననలన్నీ నిచ్చె
పెనఁగక బంగారుపీఁట వెట్టవే
పనిలేని వాదులేల పంతములన్నీ వచ్చె
పొనుఁగక గందమూనుఁ బూవు నీయవే
(॥అప్పటి॥)
చిడుముడి సిగ్గు దేరె శ్రీవేంకటేశుఁడు గూడె
వొడఁబడితి పాదాల కొగ్గి మొక్కవే
వెడఁగు నవ్వులు నిండె వేడుకలె సమకూడె
తడవక పన్నీరు దప్పికీయవే
(||pallavi||)
appaḍi kobāna nannī naṁṭi nenu
tappulannīm̐ derĕnu daṁḍagu rammanave
(||appaḍi||)
saṁkĕlĕllām̐ dīrĕnu sarasum̐ḍu tānĕ vachchĕ
maṁkum̐danamu mānidi māḍalāḍave
iṁkā neḍasuddu lemisesinām̐ jĕllĕ
paṁkiṁchaga sedigi bāgāliyyave
(||appaḍi||)
manasu nirmalamāya mannanalannī nichchĕ
pĕnam̐gaga baṁgārubīm̐ṭa vĕṭṭave
panileni vādulela paṁtamulannī vachchĕ
pŏnum̐gaga gaṁdamūnum̐ būvu nīyave
(||appaḍi||)
siḍumuḍi siggu derĕ śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕ
vŏḍam̐baḍidi pādāla kŏggi mŏkkave
vĕḍam̐gu navvulu niṁḍĕ veḍugalĕ samagūḍĕ
taḍavaga pannīru dappigīyave