అప్పటి కోప మించుకే ఆపఁగలేవైతివి
(॥పల్లవి॥)
అప్పటి కోప మించుకే ఆపఁగలేవైతివి
వొప్పుగా విభుని కెట్టు వుత్తరమిచ్చేవే
(॥అప్ప॥)
చెక్కునొక్కి నీకు బుద్దిఁచెప్పడా ఆతఁడు దొల్లి
వొక్కటై ఆపెనుఁ గూడుకుండు మనుచు
యిక్కడ నది మఱచి యింతితో వాదించితివి
యెక్కువ నాతనిమొగ మేమని చూచేవే
(॥అప్ప॥)
సేయరానిప్రియమెల్లాఁ జేయఁడా ఆతఁడు దొల్లి
మాయల సవతి పోరు మానుమంటా
ఆయమెరగక వొట్లాపెకేల పెట్టితివి
చాయల నీతని కెట్టు సమ్మతి సేసేవే
(॥అప్ప॥)
శ్రీ వేంకటేశుఁడు నిన్నుఁ జేరికూడఁడా తొల్లి
సేవసేసీ నాపె నీకుఁ జేకొనుమని
వేవేలుతి నాడి వెనక బుజ్జగించితి
నీవిభుఁ డీతని కెంత నేరువు చూపేవే
(||pallavi||)
appaḍi koba miṁchuge ābam̐galevaidivi
vŏppugā vibhuni kĕṭṭu vuttaramichcheve
(||appa||)
sĕkkunŏkki nīgu buddim̐sĕppaḍā ādam̐ḍu dŏlli
vŏkkaḍai ābĕnum̐ gūḍuguṁḍu manusu
yikkaḍa nadi maṟasi yiṁtido vādiṁchidivi
yĕkkuva nādanimŏga memani sūseve
(||appa||)
seyarānipriyamĕllām̐ jeyam̐ḍā ādam̐ḍu dŏlli
māyala savadi poru mānumaṁṭā
āyamĕragaga vŏṭlābĕgela pĕṭṭidivi
sāyala nīdani kĕṭṭu sammadi seseve
(||appa||)
śhrī veṁkaḍeśhum̐ḍu ninnum̐ jerigūḍam̐ḍā tŏlli
sevasesī nābĕ nīgum̐ jegŏnumani
veveludi nāḍi vĕnaga bujjagiṁchidi
nīvibhum̐ ḍīdani kĕṁta neruvu sūbeve