Appadi kaamtaalaana namtimgaa ninnu

అప్పటి కాఁతాళాన నంటిఁగా నిన్ను
Language

(॥పల్లవి॥)
అప్పటి కాఁతాళాన నంటిఁగా నిన్ను
అప్పగించేవా వలపులంటిఁగా నిన్ను

(॥అప్ప॥)
వీడిన నీనాసంది విరహతాపుపు వేళ
ఆడరాని మాటలెల్లనంటిఁగా నిన్ను
యీడనే నీవు మన్నించేదించుకానెరఁగ లేక
ఆడుకోలు మాట దప్పెనంటిఁగా నిన్ను

(॥అప్ప॥)
మంకుల నాకోరికతో మనసు పట్టఁగలేక
అంకెకు వచ్చినట్టెల్లానంటిఁగా నిన్ను
పొంకపు నీకృప నేఁ బొసగఁ దెలియలేక
అంకగానివలెనే అంటిఁగా నిన్ను

(॥అప్ప॥)
పాయక నీవు నన్నుఁబై కొంట దెలియలేక
ఆయాలు సోఁకిన వెంగెమంటిఁగా నిన్ను
యీయెడ శ్రీవేంకటేశ యిట్టె నీవు గూడఁగాను
ఆయఁబోయ నిఁకనేల అంటిఁగా నిన్ను

(||pallavi||)
appaḍi kām̐tāḽāna naṁṭim̐gā ninnu
appagiṁchevā valabulaṁṭim̐gā ninnu

(||appa||)
vīḍina nīnāsaṁdi virahadābubu veḽa
āḍarāni māḍalĕllanaṁṭim̐gā ninnu
yīḍane nīvu manniṁchediṁchugānĕram̐ga lega
āḍugolu māḍa dappĕnaṁṭim̐gā ninnu

(||appa||)
maṁkula nāgorigado manasu paṭṭam̐galega
aṁkĕgu vachchinaṭṭĕllānaṁṭim̐gā ninnu
pŏṁkabu nīkṛpa nem̐ bŏsagam̐ dĕliyalega
aṁkagānivalĕne aṁṭim̐gā ninnu

(||appa||)
pāyaga nīvu nannum̐bai kŏṁṭa dĕliyalega
āyālu som̐kina vĕṁgĕmaṁṭim̐gā ninnu
yīyĕḍa śhrīveṁkaḍeśha yiṭṭĕ nīvu gūḍam̐gānu
āyam̐boya nim̐kanela aṁṭim̐gā ninnu