అప్పటి గురుతులెల్లా నట్టె వున్నవి
(॥పల్లవి॥)
అప్పటి గురుతులెల్లా నట్టె వున్నవి
దెప్పరమునఁ గొంత సాత్మించనీయరాదా
(॥అప్ప॥)
నెట్టనఁ గళలు దేరె నీ మొగము చూచితేను
నట్టుకొట్టి నాకైతే నవ్వువచ్చీని
ముట్టి నిన్నుఁ జూడుమని ముసుఁగేల తీసేవు
జట్టి నీవేఁడి చేఁతలు చల్లారనీరాదా
(॥అప్ప॥)
వద్దనుండి నీమేని వాసన మూరుకొంటే
కొద్దిమీరి చూపులఁ గుంకుమ రాలీని
అద్దో నే వంచిన సిరసట్టె యేల యెత్తేవు
బద్దులు యీవేళ మట్టుపడనియ్యరాదా
(॥అప్ప॥)
గక్కన నీచెమటమై కాఁగిలించుకొంటేమ
చిక్కి నాతమి నీమీఁదఁ జిమ్మిరేఁగీని
అక్కరై శ్రీవేంకటేశ అలమేలుమంగ నేను
చెక్కులేల నొక్కేవు చిత్తగించరాదా
(||pallavi||)
appaḍi gurudulĕllā naṭṭĕ vunnavi
dĕpparamunam̐ gŏṁta sātmiṁchanīyarādā
(||appa||)
nĕṭṭanam̐ gaḽalu derĕ nī mŏgamu sūsidenu
naṭṭugŏṭṭi nāgaide navvuvachchīni
muṭṭi ninnum̐ jūḍumani musum̐gela tīsevu
jaṭṭi nīvem̐ḍi sem̐talu sallāranīrādā
(||appa||)
vaddanuṁḍi nīmeni vāsana mūrugŏṁṭe
kŏddimīri sūbulam̐ guṁkuma rālīni
addo ne vaṁchina sirasaṭṭĕ yela yĕttevu
baddulu yīveḽa maṭṭubaḍaniyyarādā
(||appa||)
gakkana nīsĕmaḍamai kām̐giliṁchugŏṁṭema
sikki nādami nīmīm̐dam̐ jimmirem̐gīni
akkarai śhrīveṁkaḍeśha alamelumaṁga nenu
sĕkkulela nŏkkevu sittagiṁcharādā