Appadi beeramudone atte vumduduvu gaaga

అప్పటి బీరముతోనె అట్టె వుండుదువు గాక
Language

(॥పల్లవి॥)
అప్పటి బీరముతోనె అట్టె వుండుదువు గాక
పిప్పి సేసినందుమీఁదఁ బిసుకఁగ వత్తురా

(॥అప్పటి॥)
వొట్టి నీతో మాటలాడ నొల్ల నొల్ల ననఁగానె
పట్టేవు నాకొంగు బలువా యిది
చిట్టకాన వా దడిచి సిగ్గు గలవాఁడ వట్టె
గుట్టున నుందురు గాక కొసరంగ వత్తురా

(॥అప్పటి॥)
ఆరయ నేఁ గోపగించి ఆన లెల్లఁ బెట్టఁగానె
సారె నాతో నవ్వేవు చలమా యిది
యేర నాతోఁ బంత మాడి యింటికి రా నన్నవాఁడ
వూరకే వుండుదు గాక వొరయంగ వత్తురా

(॥అప్పటి॥)
తక్కరి నీసుద్దులకు తలవంచు కుండఁగాను
మొక్కేవు నాకు నింకా మోహమా యిది
యెక్కువ శ్రీవెంకటేశ యింత బత్తి గలవాఁడ
వక్కరతో నుందు గాక ఆగడాలు వలెనా

(||pallavi||)
appaḍi bīramudonĕ aṭṭĕ vuṁḍuduvu gāga
pippi sesinaṁdumīm̐dam̐ bisugam̐ga vatturā

(||appaḍi||)
vŏṭṭi nīdo māḍalāḍa nŏlla nŏlla nanam̐gānĕ
paṭṭevu nāgŏṁgu baluvā yidi
siṭṭagāna vā daḍisi siggu galavām̐ḍa vaṭṭĕ
guṭṭuna nuṁduru gāga kŏsaraṁga vatturā

(||appaḍi||)
āraya nem̐ gobagiṁchi āna lĕllam̐ bĕṭṭam̐gānĕ
sārĕ nādo navvevu salamā yidi
yera nādom̐ baṁta māḍi yiṁṭigi rā nannavām̐ḍa
vūrage vuṁḍudu gāga vŏrayaṁga vatturā

(||appaḍi||)
takkari nīsuddulagu talavaṁchu kuṁḍam̐gānu
mŏkkevu nāgu niṁkā mohamā yidi
yĕkkuva śhrīvĕṁkaḍeśha yiṁta batti galavām̐ḍa
vakkarado nuṁdu gāga āgaḍālu valĕnā