అప్పటప్పటివేలలు నన్నియు వివేకించి
(॥పల్లవి॥)
అప్పటప్పటివేలలు నన్నియు వివేకించి
తప్పకుండా దైవమునే తలఁచపోయి జీవుఁడా
(॥అప్ప॥)
తచ్చిన యాహారము తరవాతనే నిద్ర
వచ్చు సురతాంతమున వైరాగ్యఁము
గచ్చుల కర్మాంతమునఁ గానవచ్చు నల పెల్లా
మెచ్చుల సత్యము కొన మించి యుండుధర్మము
(॥అప్ప॥)
పసిఁడి వెచ్చించునాఁడె పట్టును లోభము లెల్లా
ముసలితనాన వచ్చు విసు వెల్లాను
వెస సంసారపు వేళనే యాసలు వుట్టు
పొసఁగి యిట్టె జ్ఞానముపొంత నుండు సుఖము
(॥అప్ప॥)
కోపము దేరినమీఁద కూడవచ్చు శాంతము
చేపట్టి భక్తి గలిగితే చేరు మోక్షము
యేపొద్దు శ్రీవేంకటేశు నెడయక శరణంటె
కాపాడి యతఁడే యిచ్చు ఘనబ్రహ్మానందము
(||pallavi||)
appaḍappaḍivelalu nanniyu vivegiṁchi
tappaguṁḍā daivamune talam̐saboyi jīvum̐ḍā
(||appa||)
tachchina yāhāramu taravādane nidra
vachchu suradāṁtamuna vairāgyam̐mu
gachchula karmāṁtamunam̐ gānavachchu nala pĕllā
mĕchchula satyamu kŏna miṁchi yuṁḍudharmamu
(||appa||)
pasim̐ḍi vĕchchiṁchunām̐ḍĕ paṭṭunu lobhamu lĕllā
musalidanāna vachchu visu vĕllānu
vĕsa saṁsārabu veḽane yāsalu vuṭṭu
pŏsam̐gi yiṭṭĕ jñānamubŏṁta nuṁḍu sukhamu
(||appa||)
kobamu derinamīm̐da kūḍavachchu śhāṁtamu
sebaṭṭi bhakti galigide seru mokṣhamu
yebŏddu śhrīveṁkaḍeśhu nĕḍayaga śharaṇaṁṭĕ
kābāḍi yadam̐ḍe yichchu ghanabrahmānaṁdamu