అప్పటప్పటికి బాగా లందియ్య వలె మనకు
(॥పల్లవి॥)
అప్పటప్పటికి బాగా లందియ్య వలె మనకు
చెప్పరే కతలు యిఁకఁ జింత లేఁటికి
(॥అప్పట॥)
ముసిముసినవ్వులతో ముంగిట నుండినచెలిఁ
గొసరి కొసరి పతి కొంగు వట్టెను
వసమై యిద్దరు లోన వడిఁ బవ్వళించి రదే
యెసఁగి వాకిట మన మిట్టే వుందమే
(॥అప్పట॥)
చిప్పిలుఁ జెమటతోడ సిగ్గువడి వున్నసతిఁ
గప్పి పచ్చడ మాతఁడు గాఁగిలింనెచు
దెప్పర మిద్దరు దోమతెరలోఁ గూచుండి రిదే
కొప్పులు ముడుచుకొంటాఁ గూచందమే
(॥అప్పట॥)
మాట లాడె అలమేలుమంగఁ చెక్కు నొక్కి కూడె
మేటి శ్రీవెంటకపతి మించురతుల
మాటున నుండి వచ్చి మనవద్ద నిలిచిర
చాటువ సురటులు విసరు చుందమే
(||pallavi||)
appaḍappaḍigi bāgā laṁdiyya valĕ managu
sĕppare kadalu yim̐kam̐ jiṁta lem̐ṭigi
(||appaḍa||)
musimusinavvulado muṁgiḍa nuṁḍinasĕlim̐
gŏsari kŏsari padi kŏṁgu vaṭṭĕnu
vasamai yiddaru lona vaḍim̐ bavvaḽiṁchi rade
yĕsam̐gi vāgiḍa mana miṭṭe vuṁdame
(||appaḍa||)
sippilum̐ jĕmaḍadoḍa sigguvaḍi vunnasadim̐
gappi pachchaḍa mādam̐ḍu gām̐giliṁnĕsu
dĕppara middaru domadĕralom̐ gūsuṁḍi ride
kŏppulu muḍusugŏṁṭām̐ gūsaṁdame
(||appaḍa||)
māḍa lāḍĕ alamelumaṁgam̐ sĕkku nŏkki kūḍĕ
meḍi śhrīvĕṁṭagabadi miṁchuradula
māḍuna nuṁḍi vachchi manavadda nilisira
sāḍuva suraḍulu visaru suṁdame