అప్పటప్పటి వేడుక లవె చూతురుగాక
(॥పల్లవి॥)
అప్పటప్పటి వేడుక లవె చూతురుగాక
తప్పని వివేకములఁ దలపోసేరా
(॥అప్ప॥)
వింతగా నాపెను నీవెంటఁబెట్టుక వచ్చితిఁ
వింతకంటె మరి నీవు యేమి సేతువూ
చెంతల సిగ్గులు విడిచినవారు లోకులెల్లా
యింతటా నవ్వేరని యెంచఁబొయ్యేరా
(॥అప్ప॥)
పొదిగి యాపెకుఁగాను పూనుక మాఁటలాడేవు
యిది నీసాజమే యింక నేమి సేతువూ
వదిలి వెరపులేని వారు తమయిచ్చనుండి
కదిసి నిచ్చలపుతగవు లెంచేరా
(॥అప్ప॥)
గక్కన నాపెఁ గూడి కాఁగిట నన్నుగూడితిఁ
వెక్కడా నీకుఁ గలది యేమిసేతువూ
చక్కనిశ్రీవేంకటేశ సారె మోహించినవారు
వొక్కటయ్యేదే కాక వొల్లమనేరా
(||pallavi||)
appaḍappaḍi veḍuga lavĕ sūdurugāga
tappani vivegamulam̐ dalaboserā
(||appa||)
viṁtagā nābĕnu nīvĕṁṭam̐bĕṭṭuga vachchidim̐
viṁtagaṁṭĕ mari nīvu yemi seduvū
sĕṁtala siggulu viḍisinavāru logulĕllā
yiṁtaḍā navverani yĕṁcham̐bŏyyerā
(||appa||)
pŏdigi yābĕgum̐gānu pūnuga mām̐ṭalāḍevu
yidi nīsājame yiṁka nemi seduvū
vadili vĕrabuleni vāru tamayichchanuṁḍi
kadisi nichchalabudagavu lĕṁcherā
(||appa||)
gakkana nābĕm̐ gūḍi kām̐giḍa nannugūḍidim̐
vĕkkaḍā nīgum̐ galadi yemiseduvū
sakkaniśhrīveṁkaḍeśha sārĕ mohiṁchinavāru
vŏkkaḍayyede kāga vŏllamanerā