Appadanumtiyum jeppevaa suddulu

అప్పటనుంటియుఁ జెప్పేవా సుద్దులు
Language

(॥పల్లవి॥)
అప్పటనుంటియుఁ జెప్పేవా సుద్దులు
అప్పుడే అన్నియు వింటినా సుద్దులు

(॥అప్పట॥)
అంగడికెల్లానెక్కెను ఆసుద్దులు
అంగనలందరు విన్నారాసుద్దులు
అంగమా నాకాడుకోను ఆసుద్దులు నీకు
నంగదలన్నియుఁ బాపనాసుద్దులు

(॥అప్పట॥)
ఆరితేరెనింతలోనే ఆసుద్దులు
ఆరచి కతలవంటివాసుద్దులు
ఆరఁగాఁ బండినపంటలాసుద్దులు
ఆరీతినే యియ్యకొంటినాసుద్దులు

(॥అప్పట॥)
అలుకలిన్నియుఁబాపె నాసుద్దులు
అలయని రతులలో నాసుద్దులు
అలమేల్‌మంగను నేను ఆసుద్దులు
అలమితి శ్రీవేంకటేశాసుద్దులు

(||pallavi||)
appaḍanuṁṭiyum̐ jĕppevā suddulu
appuḍe anniyu viṁṭinā suddulu

(||appaḍa||)
aṁgaḍigĕllānĕkkĕnu āsuddulu
aṁganalaṁdaru vinnārāsuddulu
aṁgamā nāgāḍugonu āsuddulu nīgu
naṁgadalanniyum̐ bābanāsuddulu

(||appaḍa||)
āriderĕniṁtalone āsuddulu
ārasi kadalavaṁṭivāsuddulu
āram̐gām̐ baṁḍinabaṁṭalāsuddulu
ārīdine yiyyagŏṁṭināsuddulu

(||appaḍa||)
alugalinniyum̐bābĕ nāsuddulu
alayani radulalo nāsuddulu
alamel‌maṁganu nenu āsuddulu
alamidi śhrīveṁkaḍeśhāsuddulu