Appadanumdi mana annuvatti tala kekke

అప్పటనుండి మన అన్నువట్టి తల కెక్కె
Language

(॥పల్లవి॥)
అప్పటనుండి మన అన్నువట్టి తల కెక్కె
చెప్పినదాఁకా నీ చెఱఁగు విడువరా

(॥అపటి॥)
మోము చూచి నవ్వి నీవు మోవి గదలంచితివి
ఆమని మోహనమంత్ర మటురా వోరి
కామించి నా మర్మ మంటి కస్తూరి పూసితివి
యేమిరా వలపుమందు యిది కాఁబోలు రా

(॥అపటి॥)
మంచివానివలెఁ గంటమాల మెడఁ బెట్టితివి
పొంచి నన్ను మరగించే పూసలో వోరి
కొంచక నా కొప్పులోన కురువేరు ముడిచితివి
వంచి నన్ను లోను సేసే వాకట్టు గాఁబోలు రా

(॥అపటి॥)
కొంకక న న్నిటు గూడి గోర నేమో గీరితివి
అంకె నన్నుఁ బాయని నీయంత్రమో వోరి
పొంకపు శ్రీవేంకటేశ పొదిగి కూడితి విటే
కింకలేని రతులలో క్రియలు గాఁబోలు రా

(||pallavi||)
appaḍanuṁḍi mana annuvaṭṭi tala kĕkkĕ
sĕppinadām̐kā nī sĕṟam̐gu viḍuvarā

(||abaḍi||)
momu sūsi navvi nīvu movi gadalaṁchidivi
āmani mohanamaṁtra maḍurā vori
kāmiṁchi nā marma maṁṭi kastūri pūsidivi
yemirā valabumaṁdu yidi kām̐bolu rā

(||abaḍi||)
maṁchivānivalĕm̐ gaṁṭamāla mĕḍam̐ bĕṭṭidivi
pŏṁchi nannu maragiṁche pūsalo vori
kŏṁchaga nā kŏppulona kuruveru muḍisidivi
vaṁchi nannu lonu sese vāgaṭṭu gām̐bolu rā

(||abaḍi||)
kŏṁkaga na nniḍu gūḍi gora nemo gīridivi
aṁkĕ nannum̐ bāyani nīyaṁtramo vori
pŏṁkabu śhrīveṁkaḍeśha pŏdigi kūḍidi viḍe
kiṁkaleni radulalo kriyalu gām̐bolu rā